రిలేషన్ షిప్ లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఇది తెలుసుకోండి.

-

పైన హెడ్ లైన్ చూడగానే అందరికీ ఒక అనుమానం వస్తుంది. రిలేషన్ షిప్ లో ఒంటరిగా ఎందుకు ఫీలవుతారని, కానీ ఆల్రెడీ ఆ ఫీలింగ్ అనుభవించే వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది. అవును, రిలేషన్ లో ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తుంటుంది. దానికి చాలా కారణాలున్నాయి. మీ భాగస్వామి మీతో సరిగ్గా ఉండకపోవడం కావచ్చు. లేదా మిమ్మల్ని శాసించే గుణం మీ భాగస్వామికి ఉండడం కావచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల రిలేషన్ షిప్ లో ఒంటరితనం ఫీలింగ్ కలుగుతుంది. మరి దీన్నుండి బయటపడడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం.

అర్థం చేసుకోండి

మీ భాగస్వామి కూడా మీలానే ఒంటరిగా ఫీలవుతున్నారా అనేది అర్థం చేసుకోండి. కేవలం మీ భావాలను మాత్రమే తీసుకుని నిర్ణయం తీసుకోవద్దు.

గుర్తించండి

మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్నప్పుడు దానికి కారణమేంటో గుర్తించండి. ఆలోచించండి. ఇలా ఫీల్ అవడానికి కారణం ఏంటని వెతకండి. జరుగుతున్న సంఘటనలను విశ్లేషించుకుంటూ వెళ్తే దానికి కారణం ఈజీగా దొరుకుతుంది. అలాంటప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవచ్చు.

పరిష్కారాలు

పరిష్కారాల కోసం వెతకండి. అవి మీ రిలేషన్ ని విడదీసేలా ఉండకుంటే బెటర్. లేదంటే మొదటికే మోసం వస్తుంది. చెట్టు కొమ్మ బాలేకపోతే చెట్టునే నరికేయవద్దు. అందుకే పరిష్కారాలు దొరికేలా చూసుకోండి.

కొత్త ఆసక్తులు

కొత్త అభిరుచులను ఏర్పర్చుకోండి. దానివల్ల మీరు బిజీగా ఉంటారు. అప్పుడు అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా రావు. కాబట్టి రిలేషన్ షిప్ బాగుంటుంది.

బంధాలు

ఇతరులతో బంధాలను బలపర్చుకోండి. కుటుంబం, స్నేహితులు, ఇంకా మీ ఆఫీస్ కొలీగ్స్ మొదలగు వారితో బంధాలు దృఢపర్చుకోండి.

నెమ్మదిగా ఉండండి

మీరు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారో మీ భాగస్వామికి తెలియజేయండి. అలా అని ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళకి చెప్పేసి అర్థం చేసుకోవాలని అనుకోవద్దు. నిదానంగా ఉండండి. అవతలి వారికి మెల్లగా అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news