నలుగురు భామల మధ్య రజిని… దుమ్ము లేపిన “పెద్దన్న” ట్రైలర్

-

సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఈ పేరు తెలియని వారుండరు. తమిల్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ రజీనికి ఉంది. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం అన్నాత్తే… మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నoడగా… ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా తెలుగులో “పెద్దన్న” పేరుతో విడుదల అవుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది పెద్దన్న. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర బృందం పెద్దన్న ట్రైలర్ ను విడుదల చేశారు.

రజనీకాంత్ అభిమానులు కోరుకునే యాక్షన్ మరియు కామెడీ…. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ ను చూస్తేనే మనకు అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్ మరియు డైలాగ్స్ అందరిని మెప్పిస్తాయి. రజినీకాంత్ సోదరిగా కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకునేలా కనిపించింది. ఇక అటు రజనీకాంత్ సరసన నయనతార మెప్పించింది. అలాగే మీనా మరియు కుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా అంచనాలను పెంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news