మీ గ్రామవాలంటీర్ ఎవరో ఇలా ఈజీగా ఫోన్ నంబర్ తో సహా తెలుసుకోవచ్చు..!

ఏపీ ప్రభుత్వం సంక్షేమపథకాలు అర్హులందరికీ చేరేవేయాలే ఉద్దేశంతో వాలంటీర్ వ్వవస్థకు నాందిపలికింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను కేటాయించి ఆ 50 కుటుంబాల వినతులు, వారి సమస్యలు తెలుసుకుని..అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందేలా చూడటం ఆ వాలంటీర్ పని. ముందు మనం వాలంటీర్ విధులేంటో తెలుసుకుందా..అప్పుడు మన వాలంటీర్ ఆ పనులు చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

వాలంటీర్ల విధులు:

⎆ లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర.
⎆ కులం, మతం, రాజకీయ విభేదం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి.
⎆ తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని గ్రామ, వార్డు సచివాలయంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకోనీ పరిష్కరించాలి.
⎆ గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే మీటింగ్‌లకు వాలంటీర్లు హజరు కావాలి. తన పరిధిలో ప్రజానీకం సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందిస్తూ ఉండాలి.
⎆ ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించాలి.
⎆ రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీరు తదితర అంశాలలో ఏమైనా సమస్య ఉంటే వాలంటీర్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలి.
⎆ లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో తయారుచేసుకోవాలి.
⎆ విద్య, ఆరోగ్య పరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.

ఈ అంశాలలో మీకు ఏదైనా సమస్య ఉంటే వాలంటీర్ ను సంప్రదిస్తాం..అయితే మన ఇంటికి వచ్చే వాలంటీర్ వివరాలు మనకు తెలిసిఉండాలి. కొన్నిసార్లు అసలు మన వాలంటీర్ ఎవరూ అనేది కూడా మనకు తెలియదు. సడన్ గా ఆ వాలంటీర్ తో ఏదైనా పనిపడితే..అరే మన వాలంటీర్ ఎ‌వరూ అని అప్పుడు పక్కనవాళ్లను అడగటమో ఏదో చేస్తుంటాం. కానీ ఇంట్లో ఉండే మీ వాలంటీర్ ఎవరో మీ ఆధార నంబర్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ వాలంటీర్ ఫోన్ నంబర్ కూడా వస్తుంది. దాంతో మనం తేలికగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్ ఈ లింగ్ మీద gramawardsachivalayam.ap.gov.in క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి,ఒక క్యాప్చా వస్తుంది. అది ఎంటర్ చేసి Check బటన్ వద్ద క్లిక్ చేయండి.
అంతే మీ వాలంటీర్ పేరు, మొబైల్ నెంబర్, సచివాలయం వివరాలు అన్ని మీకు వచ్చేస్తాయి.

ఇలా మీ వాలంటీర్ వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. కావలంటే మీరు ఓసారి చెక్ చేసి చూడండి.