పంజాబ్ లో కీలక పరిణామం… రాజీనామాను వెనక్కి తీసుకున్న సిద్ధూ..

-

పంజాబ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్దూ మెత్తబడ్డాడు. తాజాగా తాను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు. సిద్దూ సెప్టెంబర్ 28న కాంగ్రెస్ పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చరన్ జీత్ చన్నీ మంత్రి వర్గం కూర్పుపై అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేశారు. అయితే తాజాగా రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో వివాదం సమసిపోయింది. చన్నీ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తనకు కావాల్సింది పంజాబ్ అభివ్రుద్ధే అని స్పష్టం చేశారు. పంజాబ్ తన ఆత్మ అని సిద్ధూ అన్నారు. అయితే పంజాబ్ లో డ్రగ్స్ నియంత్రణకు చన్నీ ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని సిద్దూ డిమాండ్ చేశారు.

కాగా గతంలో అమరిందర్ సింగ్ సీఎంగా ఉన్న సమయంలో సిద్దూకు పడకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కెప్టెన్ అమరిందర్ సింగ్ కోరికలకు విరుద్ధంగా సిద్దూను కాంగ్రెస్ అధిష్టానం జూలై 23న పీసీసీ చీఫ్ గా నియమించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో కెప్టెన్ అమరిందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి హై కమాండ్ తొలగించింది. తరువాత చన్నీని సీఎం చేయడం, సిద్దూ పీసీసీ పదవికి రాజీనామా చేయడం జరిగాయి. తాజాగా రాజీనామాను సిద్ధూ విరమించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

Read more RELATED
Recommended to you

Latest news