గాలిలో ఎగురుతున్న చేప‌.. ఇదేం వింత‌..!

సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్.. అనగా జీవనం సాగించేందుకు గాను ప్రతీ ఒక్కరు పోటీ ప్రపంచంలో మరొకరితో పోటీ పడాల్సిందే. అలా నిలబడగలిగిన వారికే ప్రస్తుతం మనుగడ ఉంటున్న సంగతి అందరికీ విదితమే. ఒకరకంగా బలవంతుడిదే జీవనం. కాగా, ప్రపంచంలో ఎన్నో జీవులు మానవాళి మాదరిగానే జీవిస్తున్నాయి. అయితే, కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న జీవులు చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ కోవకు చెందిన జీవే ఈ స్పెషల్ చేప‌. ఈ ఫిష్ కొండలను సైతం మనుషుల వలే ఎక్కగలదట. అదెక్కడుందంటే..

సాధారణంగా చేప అనగానే అందరూ చెరువులోనో సంద్రంలోనో ఉంటుంది అని అనుకుంటారు. అది నిజమే. కానీ, మనం తెలుసుకోబోయే ఈ చేప మాత్రం చెరువులోనూ కొండపైనా ఉంటుంది. హవాయి దీవుల్లోని కనిపించే ఈ చేప పేరు ఓప్. కాగా, ఇది జలపాతాలలోని రాళ్లపై పాకుతుంది. సుమారు 300 మీటర్ల వరకు ప్రయాణించి కొండ పీక్ వరకు రీచ్ అవుతుంది. అయితే, ఈ ఓప్ ఫిషెస్‌కు మౌత్, స్టమక్ కింద ఉండే రెక్కల వంటి భాగాల స్పెషల్ పార్ట్స్ అమరిక ఉంటుంది. వాటి సాయంతోనే ఇది జలపాతాలు, రాళ్లను ఈజీగా ఎక్కగలుగుతుంది.

ఈ చేపలు సుమారు 300 మీటర్ల ఎత్తు వరకు గల కొండలను ఈజీగా క్లైంబ్ చేయగలవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జీవనం కోసం ఇవి తమ రంగును కూడా మార్చుకుంటాయి. నార్మల్‌గా ఇవి గోధుమ కలర్‌లో ఉండగా, పరిస్థితులకు తగ్గట్లు మారిపోతాయి. చుట్టుపక్కల ఎన్విరాన్‌మెంట్‌ను బట్టి అందులో ఇమిడిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా తమని తాము మార్చుకుంటాయి. ఈ ఫిషెస్ ఒక అడుగు పొడవు వరకు పెరిగే అవకాశముందట. ఆరు హవాయి దీవుల్లో ఈ ఫిషెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు జాతులుగా ఈ చేపలు ఉంటాయి. ఇందులో కేవలం నాలుగు జాతులకే రాళ్లు, కొండలను పాకే ప్రత్యేక సామర్థ్యం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.