చెరువులో ముత్యాల ఉత్ప‌త్తి ద్వారా రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్న బీహార్ యువ‌కుడు..

Join Our Community
follow manalokam on social media

బీహార్‌లోని పాట్నాతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు సాధార‌ణంగా మొక్క‌జొన్న‌, ప‌ప్పు దినుసులు, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, బియ్యం ఎక్కువ‌గా పండిస్తారు. అయితే ఆ యువ‌రైతు మాత్రం వేరే దిశ‌గా ప్రయాణం చేయాల‌ని అనుకున్నాడు. చంపార‌న్ జిల్లాలోని మురేరా గ్రామానికి చెందిన నిటిల్ భ‌ర‌ద్వాజ్ ముత్యాల వ్య‌వ‌సాయం ప్రారంభించాడు. దాంతో అత‌ను రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు.

bihar youth earning in lakhs with pearls farming

నిటిల్ ది రైతుల కుటుంబం. కానీ ఢిల్లీలో ఓ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలో ప‌నిచేశాడు. 2017లో అత‌ను కంప్యూట‌ర్ ప్రొఫెష‌న‌ల్‌గా కెరీర్ ప్రారంభించాడు. నెల‌కు రూ.30వేల వ‌ర‌కు వ‌చ్చేవి. అయితే ఒక సారి త‌న తండ్రి ముత్యాల వ్య‌వ‌సాయం గురించి చెప్పాడు. దీంతో అత‌నిపై నిటిల్‌కు ఆసక్తి క‌లిగింది. అంతే వెంట‌నే త‌న ఆలోచ‌న‌ను అమ‌లులో పెట్టేశాడు.

ముందుగా నిటిల్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పెర‌ల్ ఫామ్‌లో ముత్యాల వ్య‌వ‌సాయం కోసం శిక్ష‌ణ పొందాడు. త‌రువాత త‌న గ్రామంలోనే సొంతంగా దాన్ని ప్రారంభించాడు. ఈ క్ర‌మంలోనే మొద‌టి ప్ర‌యత్నంలోనే అత‌ను విజ‌యం సాధించాడు. రూ.75వేలు సంపాదించాడు. త‌రువాత నిటిల్ వెన‌క్కి తిరిగి చూడలేదు. అయితే నిటిల్ లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారికి ప‌ని క‌ల్పించేందుకు గాను ఓ శిక్ష‌ణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దాని ద్వారా శిక్ష‌ణ అందించి నిరుద్యోగులు, కార్మికుల‌కు ఉపాధి క‌ల్పించ‌డం మొద‌లు పెట్టాడు.

కాగా నిటిల్ ముత్యాల పెంప‌కంలో భాగంగా 2019లో త‌న వ‌ద్ద ఉన్న స్థ‌లంలో చిన్న కొల‌ను ఏర్పాటు చేసి అందులో 400 గుల్ల‌ల‌ను పెంచ‌డం మొద‌లు పెట్టాడు. త‌రువాత క్ర‌మంగా వాటి సంఖ్య పెరిగింది. ఎక‌రం చెరువులో సుమారుగా 30వేల వ‌ర‌కు గుల్ల‌ల‌ను పెంచ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను మొద‌ట్లో రూ.25వేలు పెట్టుబ‌డి పెట్ట‌గా అందుకు రూ.75వేలు వ‌చ్చాయి. ఇలా అత‌ను అందులో క్ర‌మంగా ప్ర‌‌గ‌తి సాధించాడు.

ఇక ఒక ఆల్చిప్ప‌కు రూ.40 పెట్టుబ‌డి అవుతుంది. అందులో రెండు ముత్యాలు వ‌స్తాయి. ఒక్కో దాన్ని రూ.120 కు అమ్మ‌వ‌చ్చు. మంచి నాణ్య‌త ఉంటే ముత్యం ధ‌ర రూ.200 వ‌ర‌కు ప‌లుకుతుంది. ఇది లాభాల‌ను తెచ్చి పెడుతుంది. ఈ క్ర‌మంలోనే అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3.60 ల‌క్ష‌ల‌ను సంపాదించాడు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ముత్యాల‌ను ఉత్ప‌త్తి చేసేలా చెరువుల‌ను మ‌రింత విస్త‌రించ‌నున్నాడు. ఎవ‌రైనా సరే ఇందులో శ్ర‌మించాలే గానీ అద్భుత‌మైన లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చ‌ని అత‌ను చెబుతున్నాడు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...