500 నోట్లు రోడ్డు మీద ఉన్నా ఎవరూ తీసుకోలేదు, ఎందుకో తెలిస్తే…

-

రోడ్డు మీద రూపాయి కనపడినా సెంటర్ ఫ్రెష్ వస్తుంది అనుకునే బ్యాచ్ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అర్ధ రూపాయి కనపడినా సరే వదిలే వాళ్ళు ఉండరు. కాని రెండు 500 నోట్లు కనపడినా సరే ఎవరూ కూడా తీసుకోవడానికి అసలు ముందుకి రాలేదు. దానికి కారణం కరోనా. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో జనాలు ఇప్పుడు ఆ రెండు నోట్లను చూసి భయపడే పరిస్థితికి వచ్చారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని పేపర్ మిల్ కాలనీ లో గురువారం రాత్రి సమయంలో రెండు నోట్లను కాలనీ వాసులు గుర్తించారు. తీసుకోవాలి అనుకున్నా సరే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకి రాలేదు. కరోనా వైరస్ ని మరొకరికి అంటించే ఉద్దేశం తోనే వాటిని అక్కడ పడేసారు అని గుర్తించిన వాళ్ళు ఆ నోట్లను తీసుకోలేదు. పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించగా వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు…

వాటిని తీసుకుని అందరికి ఇళ్ళకు వెళ్లాలని సూచించారు. వెంటనే వాటిని వైద్యుడి దగ్గరకు అధికారులు తీసుకుని వెళ్ళారు. వాటిని 24 గంటల పాటు ఎవరూ కూడా పట్టుకోవద్దు అని సూచించారు. కరోనా వ్యాప్తి కోసమే ఎవరో వాటిని అక్కడ పడేసి ఉండవచ్చు అనే అనుమానం పోలీసులు మీడియా ముందు వ్యక్తం చేసారు. కరెన్సీ నోట్ల నుంచి కరోనా వస్తుందా రాదా అనేది స్పష్టత లేదు. రిజర్వ్ బ్యాంకు మాత్రం ముందు జాగ్రత్తగా డిజిటల్ లావాదేవీలు వాడాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news