ఫొటోలు రిసైజ్ చేసుకోవడం కోసం చాలా మంది ఫొటోషాప్.. తదితర యాప్స్, సాఫ్ట్వేర్స్ కోసం చూస్తుంటారు. కానీ అలాంటివేమీ లేకపోయినా కూడా ఇమేజ్ రిసైజ్, ఎడిటింగ్, కంప్రెస్సింగ్, ఫిల్టరింగ్ వంటివి చేసుకోవచ్చు. ఫొటోషాప్‌లో లభించే చాలా ఫీచర్లను ఉచితంగా కొన్ని ఆన్లైన్ సంస్థలు అందిస్తున్నాయి. మరి అలాంటి సదుపాయాల్ని అందించే ఆ ఆన్లైన్ ఫొటోస్ రిసైజింగ్ టూల్స్ గురించి తెలుసుకుందామా…
ఇమేజ్ రిసైజర్ టూల్స్ ప్లాట్‌ఫాంలలో ఎక్కువ మంది ఉపయోగించే వాటిలో ‘లూనాపిక్ రిసైజర్’ ఒకటి. ఇందులో వందలాది ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. గ్రాబ్ అండ్ డ్రాగ్ సహా పలు కస్టమైజ్డ్ ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు. ఫొటోషాప్‌లో ఉండే ఆప్షన్ చాలా వరకు ఇందులో మనకు అందుబాటులో ఉంటాయి.
క్రాప్, షార్పెన్, కంప్రెస్, రిసైజ్ వంటి ఫీచర్లు ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. దాంతో పాటు ఈ వెబ్సైట్లో రకరకాల ఎడిటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఇది బల్క్ ఇమేజ్ ప్రాసెసింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది.
‘పిక్ రిసైజ్’ అనేది ఆన్లైన్ ఫొటో రిసైజింగ్ టూల్. ఈ టూల్ ద్వారా ఫొటోలను ప్రీసెట్ పర్సెంటేజీ ఆధారంగా సైజుల్లో మార్పులు చేసుకోవచ్చు.
పిక్ ఘోస్ట్ ఇందులో మీరు ఒకేసారి 40 ఫొటోలను ఎడిటింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇమేజెస్ ప్రిసెట్ రేంజ్, కస్టమ్ స్థాయుల్ని మార్పులు చేసుకోవచ్చు.
‘క్విక్ థంబ్‌నెయిల్’ టూల్ ద్వారా క్విక్ ఇమేజ్ రిసైజింగ్తో పాటు, ఫిల్టరింగ్ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఎడిట్ చేసుకున్న ఫొటోకు వాటర్ మార్కును జత చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రిసెట్ రిసైజ్ నిష్పత్తి ఆప్షన్ ఆకట్టుకుంటుంది.
టూల్ యువర్ ద్వారా ఫొటోలను కావాల్సిన సైజులోకి కంప్రెస్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ టూల్లో ఇమేజ్ ఎత్తు, వెడల్పుకు సంబంధించి మనకు కావాల్సిన ప్రమాణాల్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.
గో టూ కన్వర్టర్ 200 ఫార్మాట్లలో ఇది పనిచేస్తుంది. ఇందులోనూ రిసైజ్తో పాటు ఇమేజ్ కంప్రెస్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా వెబ్రిసైజర్, బీఫంకీ, సింపుల్ ఇమేజ్ రిసైజర్, ఇమేజ్ ఆప్టిమైజర్, ఐఎంజీఆన్లైన్, జేపీఈజీ ఆప్టిమైజర్ వంటి అనేక టూల్స్ అందుబాటులో ఉన్నాయి.