బెడ్‌రూమ్ నుంచి టాయిలెట్‌ సీటు వరకూ మొత్తం బంగారు మయం..!

-

ఈ ప్రపంచంలో ఎన్నో లగ్జరీ హోటళ్లు ఉన్నాయి.. అక్కడ ఒక్క రోజుకు అయ్యే ఖర్చుతో ఒక సామాన్యుడు జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు.. అంత కాస్ట్ ఉంటుంది. లగ్జరీ హోటళ్లు అక్కడ ఉండే వసతులు వల్ల, డిజైన్‌ వల్ల, ప్లేస్‌ వల్ల అంత ఖరీదైనవిగా ఉంటాయి.. కానీ హోటల్‌ మాత్రం పూర్తిగా బంగారంతో చేశారు..బెడ్‌రూమ్‌ నుంచి బాత్రూమ్‌ వరకూ మొత్తం బంగారంతో చేసిన హోటల్‌ ఉంది తెలుసా..? ఈ హోటల్‌ వియాత్నంలో ఉంది. ఇక్కడ ఒక్క రోజు ఉండాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!
హనోయిలోని ఈ హోటల్ పేరు డోల్స్ హనోయి గోల్డెన్ లేక్. ఈ అందమైన ఫైవ్ స్టార్ హోటల్ 25 అంతస్తులలో 400 గదులతో నిర్మించబడింది. ఈ హోటల్ గోడలు 54,000 చదరపు అడుగుల బంగారు పూతతో ఉన్నాయి. ఉద్యోగుల డ్రెస్ కోడ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సిబ్బంది
డ్రెస్ కోడ్ ఎరుపు, బంగారు రంగులో ఉంటుంది. ఇక్కడి గదుల్లోని ఫర్నిచర్, వస్తువులకు కూడా బంగారు పూత పూశారు. బాత్రూమ్, సింక్ మరియు షవర్ అన్నీ బంగారంతో తయారు చేయబడ్డాయి.
ఈ హోటల్ పైకప్పుపై ఇన్ఫినిటీ పూల్ ఉంది. ఈ కొలను బయటి గోడలపై ఉన్న ఇటుకలు కూడా బంగారంతో పూత పూయబడ్డాయి. ఈ గోల్డెన్ హోటల్ 2009లో నిర్మించబడింది. బంగారం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని నమ్ముతారు. అందుకే ఈ హోటల్‌ను బంగారంతో నిర్మించారట.
ఇక్కడ గదులు సుమారు 20 వేల రూపాయల నుండి ప్రారంభమవుతాయి. డబుల్ బెడ్ రూం సూట్‌లో రాత్రి బసకు అద్దె రూ.75వేలు. ఈ హోటల్‌లో 6 రకాల గదులు మరియు 6 సూట్‌లు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రి ధర రూ.4.85 లక్షలు. హోటల్‌లో గేమింగ్ క్లబ్ కూడా ఉంది, ఇది రోజులో 24 గంటలు తెరిచి ఉంటుంది. క్యాసినో, పేకాట వంటి ఆటలు కూడా ఇక్కడ ఆడతారు. ఇక్కడ గెలవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news