ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఐతే కీటకాల నుండి రక్షించడానికి ఈ చిట్కాలు పాటించండి.

ఉద్యానవనంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఆనందమే వేరు. చుట్టూ పచ్చని చెటులు మధ్యలో చిన్న ఇల్లు, స్వఛ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం, సాయంత్రం పూట ఆ మొక్కలకి నీళ్ళు పోయడం అంతా అదో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా ఉంటుంది. ఐతే అందరికీ ఉద్యానవనాలు ఉండవు గనక ఇంటినే ఉద్యానవనాన్ని తయారు చేసుకోవాలి.

అవును, మీకు కావాల్సిన మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. మరి ఇంట్లో పెరిగే మొక్కలను కీటకాల నుండి రక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికొరకు ప్రకృతిలో లభించే పదార్థాలనే ఉపయోగించవచ్చు. మొదటగా, వేప ఆకులు.. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఉడకబట్టి చల్లారిన తర్వాత ఒక బాటిల్ లోకి పోసుకుని రోజుకోసారి మొక్కల మీద స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిని బాగా తరిగి 1నుండి 2గంటల పాటు నీళ్ళలో ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని మొక్కల మీద స్ప్రే చేస్తే క్రిమి కీటకాల బారి నుండి మొక్కలకి రక్షణ అందుతుంది.

యూకలిప్టస్ ఆయిల్

మీ ఆయిల్ ని మొక్కల మీద డైరెక్టుగా చల్లవచ్చు. ఈగలు, దోమలు వంటి కీటకాలను దూరంగా ఉంచడానికి ఇది బాగా సాయపడుతుంది.

ఉప్పు

వంటింట్లోని ఉప్పు కూడా మొక్కలకి బాగా పనిచేస్తుంది. దీనికోసం నీటిలో ఉప్పు కలుపుకుని దాన్ని మొక్కల మీద చిలకరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కలను పాడుచేసే పురుగులను నాశనం చేయవచ్చు.

ఇంట్లో మొక్కలు పెంచే అలవాటు ఉన్నవారు ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.