ఇంటర్ ఫలితాల్లో జీరో మార్కులు.. రివాల్యుయేషన్ చేస్తే 99 మార్కులు

-

ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో చాలామంది విద్యార్థుల మార్కులు తారుమారు అయ్యాయన్న విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల జిల్లా టాపర్లు, స్కూల్ టాపర్లు ఫెయిల్ అయినట్టుగా రిజల్ట్స్ లో చూపించింది.

తెలంగాణ ఇంటర్ బోర్డులో అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమకు రావాల్సిన మార్కుల కన్నా తక్కువగా వచ్చాయని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మంచిర్యాల జిల్లాలో ఓ విద్యార్థిని మొదటి సంవత్సరంలో టాప్ మార్కులు సాధించగా… సెకండ్ ఇయర్ లో జీరో మార్కులు వచ్చాయి.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెనికి చెందిన నవ్య అనే విద్యార్థినికి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో తెలుగు పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో షాక్ కు గురయిన ఆ విద్యార్థిని రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్నది. దీంతో తనకు 99 మార్కులు వచ్చాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుండటంతో బోర్డుపై విమర్శలు వస్తున్నాయి.

ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫలితాల్లో చాలామంది విద్యార్థుల మార్కులు తారుమారు అయ్యాయన్న విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల జిల్లా టాపర్లు, స్కూల్ టాపర్లు ఫెయిల్ అయినట్టుగా రిజల్ట్స్ లో చూపించింది.

నవ్య కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు 467 మార్కులు సాధించింది. కానీ.. ద్వితీయ సంవత్సరంలో మాత్రం తెలుగు పరీక్షలో జీరో మార్కులు వచ్చాయి. దీంతో ఆమె రివాల్యుయేషన్ కు అప్లయి చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version