వార్నీ..ఏందయ్యా ఇది..మేకలకు రెయిన్ కోటు..

ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే పశువులకు వర్షాలు కురిసిన ఎం కాదు..కానీ మనుషులకు అనారోగ్య సమస్యలు వస్తాయి దాంతో వర్షాలకు తడవకుండా రెయిన్ కోట్ వేసుకొని రోడ్లపై కనిపిస్తుంటారు. కానీ ఒక ప్రదేశంలో మాత్రం రోడ్లపై రెయిన్ కోట్ వేసుకున్న మేకలు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.ఆ వింత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వింత ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. తమిళనాడులోని తంజావూర్లోని కులమంగళం అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక వ్యక్తికి చాలా మేకలు ఉన్నాయి. అతడు తన మేకలను చాలా గారాబంగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల అతను తన మేకల పట్ల ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఇది చూసే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేకల యజమాని తన అన్ని మేకల కోసం బియ్యం బస్తాలను రెయిన్ కోట్ లాగా కుట్టించాడు.

ఈ చలికాలంలో, అలాగే వర్షాకాలంలో తన మేకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే అతడిలా చేశాడట. మూగజీవుల పట్ల ఇంత కేర్ తీసుకుంటున్న ఇతడిని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఈ రైతు వయసు 70 ఏళ్లు అతని పేరు గణేశన్. ఈ మేకల యజమాని తన పొలంలో మేకలతో పాటు ఆవులు, కోళ్లను కూడా పెంచుకుంటున్నారు. అలా పాడి రైతుగా ఇతడు గ్రామంలో మంచి పేరు సంపాదించాడు. తాను పెంచుకుంటున్న ఆవులు, మేకలు, కోళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసినప్పుడు మేత మేసేలా ఇతను ఏర్పాటు చేస్తున్నాడు.గణేషన్ చేసిన ఈ ఐడియా ఇతరులను కూడా ఇన్స్పైర్ చేస్తోంది. తాము కూడా తమ పశువులకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని కొందరు చెబుతున్నారు.ఇక నెటిజన్లు మాత్రం వాట్ ఎ ఐడియా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..