గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్..రక్తం చుక్క ఖరీదు..గ్రాము బంగారం కంటే ఎక్కువే..!!

బ్లడ్‌ గ్రూప్‌ అంటే.. ఎన్ని రకాలు ఉంటాయో మనకు తెలుసు.. ఇందులో O గ్రూప్‌ వారిని ప్రాణదాతలని అంటారు. రక్తం ఒకటే రంగులో ఉన్నప్పటికీ..అందులో రకాలు ఉంటాయి.. A+, A-, B+, B-, O+, O-, AB+, AB- గ్రూపులుగా విభజిస్తారని ఇప్పటివరకు మనం విన్నాం. కానీ, ఇప్పుడు దానికి మరో బ్లడ్ గ్రూప్ యాడ్‌ అయింది.. శాస్త్రవేత్తలు ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపుగా చెప్తున్నారు. ప్రపంచంలో కేవలం 45 మందికే ఈ బ్లడ్‌ గ్రూప్‌ ఉందట..

పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి ఐదు లీటర్ల రక్తం అవసరం. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్‌ను బంగారు రక్తం (Golden blood) అంటారు. ఈ రక్తం చుక్క ఖరీదు కూడా గ్రాము బంగారం కంటే ఎక్కువే.. దీనికి కారణం ఇది అరుదైనది కావడమే.. దీనిని Rh శూన్య రక్తం అంటారు.

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటే ఏంటి?

దేవతల శరీరాల్లో బంగారు రక్తం ప్రవహిస్తుందని పురాతన గ్రీస్ విశ్వసిస్తుంది… సంక్షిప్తంగా గోల్డెన్ బ్లడ్. ఈ ద్రవం అమరత్వంతో ఉంచగలదట. అయితే, ఈ ద్రవాన్ని సాధారణ ప్రజల శరీరంలో విషపూరితంగా పరిగణించారని సైన్స్ మ్యూజియం గ్రూప్‌లో ప్రచురించిన ఒక నివేదిక చెప్తోంది. 1961లో తొలిసారిగా బంగారు రక్తం ఉన్న వ్యక్తిని కనుగొన్నారు. ఈ బ్లడ్ గ్రూప్ చాలా అరుదు కాబట్టి దీనికి గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టారు. చాలా కాలంగా ఈ పరిశోధన సామాన్య ప్రజలకు చేరువ కాలేదు. కానీ, ఇప్పుడు ఈ బ్లడ్ గ్రూప్ గురించిన సమాచారం ప్రపంచం మొత్తానికి చేరడంతో చాలా మంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ శాస్త్రీయ నామం Rhnull. ఐక్యరాజ్యసమితి అందించిన సమాచారం ప్రకారం.. ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకున్నప్పటికీ, ఈ బ్లడ్ గ్రూప్ 45 మందిలో మాత్రమే కనిపిస్తుందట…

ఎందుకు చాలా అరుదు?

ఈ బ్లడ్ గ్రూప్‌కి మనుషుల్లో చిరస్థాయిగా మారే శక్తి లేకపోయినా, ఒక్కో చుక్కలో ప్రాణాలను రక్షించే గుణాలు అద్వితీయం. ఏదైనా బ్లడ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తి శరీరంలో గోల్డెన్ బ్లడ్ అవసరమైతే ఇవ్వొచ్చు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 మందికి ఈ బ్లడ్ గ్రూప్ ఉండగా.. కేవలం 9 మంది మాత్రమే రక్తదానం చేయగలుగుతున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ జెనిటిక్ సమస్యలతో వస్తుంది. ఈ సమూహానికి చెందిన వ్యక్తులు తరచుగా రక్తహీనతతో బాధపడుతుంటారు. ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వారి రక్తంలో యాంటిజెన్ ఉండదు.
జెనెటిక్ మ్యుటేషన్ అంటే ఈ బ్లడ్ గ్రూప్ ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తుంది. లేదా దాయాదుల మధ్య వివాహం లేదా ఇలాంటి సంబంధాల విషయంలో ఈ రక్త వర్గాన్ని ముందుకు తీసుకువెళతారు. కానీ, ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వ్యక్తుల గుర్తింపును అధికారులు బహిర్గతం చేయడం లేదు..