ఈ మాస్క్ ధర అక్ష‌రాల రూ. 5 ల‌క్ష‌లు!

యూపీ: కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. బయటకు వెళ్తే ఒకటికి, రెండు మాస్కులు ధరిస్తున్నారు. కొందరు క్లాత్ మాస్కులు ధరిస్తుంటే మరికొందరు ఎన్‌ 95 మాస్క్‌లు ధరిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి బంగారం మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కాన్పూర్‌కు చెందిన మ‌నోజ్ సెంగార్ ఏకంగా బంగారు మాస్క్‌నే చేయించుకున్నారు.

 

గోల్డెన్ బాబాగా పేరుగాంచిన మ‌నోజానంద మ‌హారాజ్ అలియాస్ మ‌నోజ్ సెంగార్ ఏకంగా బంగారం మాస్క్ ధ‌రించారు. ఈ మాస్క్ ఖరీదు అక్ష‌రాల రూ. 5 ల‌క్ష‌లు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌రైన రీతిలో మాస్క్‌లు ధ‌రించ‌డంలేద‌ని, అందుకే తాను బంగారు మాస్క్ చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మాస్కులో బంగారం ట్రిపుల్ కోటింగ్ ఉంద‌నిచెప్పారు. అలాగే అది పూర్తిగా శానిటైజ్ అయిన‌ట్లు పేర్కొన్నారు. మూడేళ్ల పాటు ఈ మాస్క్ ప‌నిచేస్తుంద‌ని గోల్డెన్ బాబా స్పష్టం చేశారు.