అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు!

-

రైతులకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థిక మద్దుతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్స్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్ (Farmers Producer Organization‌ Scheme) FPO కూడా ఒకటి.

Farmers Producer Organization‌ Scheme | ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రూ.15 లక్షల రుణం అందిస్తుంది. రైతులు అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మోదీ సర్కార్ రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తుంది. ఇది రైతులకి కాస్త రిలీఫ్ ని ఇస్తుంది.

కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది దీనిలో చేరారు కూడా. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్ కింద రూ.15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాలి.

కంపెనీ చట్టం కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్తనలు, మందులు, ఎరువులు మొదలైన వాటిని రైతులకు విక్రయించొచ్చు. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు. కేంద్రం 2023-24 నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news