ఈ ఐడియాతో ఎక్కువకాలం కొబ్బరికాయలను, కొబ్బరినీళ్లను తాజాగా ఉంచొచ్చు..!

-

కొబ్బరికాయలు ఫ్రెష్ గా ఉండాలా..? పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇంట్లో కొబ్బరికాయలని నిల్వ ఉంచుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేశారంటే కొబ్బరికాయలు పాడైపోతూ ఉంటాయి. ప్రముఖ డిజిటల్ క్రియేటర్ పగలగొట్టని కొబ్బరికాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పారు. ఇలా చేశారంటే చాలా కాలం పాటు ఫ్రెష్ గా ఉంటాయి. కొబ్బరికాయలు నిల్వ ఉంచేటప్పుడు ఈథైలీన్ ప్రొడ్యూస్ చేసే పండ్లతో పాటు నిల్వ ఉంచకూడదు. ఉదాహరణకి అరటి పండ్లు, ఆపిల్ పండ్లు. వీటి పక్కన కొబ్బరికాయల్ని పెట్టడం వలన కొబ్బరికాయలు త్వరగా పాడైపోతాయి.

వాతావరణం పొడిగా ఉండే చోట కొబ్బరికాయలను నిల్వ ఉంచినట్లయితే అవి ఎక్కువ కాలం పాడైపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. సో ఈసారి మీరు కొబ్బరికాయలను స్టోర్ చేసేటప్పుడు ఈ చిట్కాని పాటించండి. తాజా కొబ్బరికాయలను సలాడ్, స్మూతీస్ వంటి వాటిని తయారు చేసుకోవడానికి వాడొచ్చు. డ్రై కొబ్బరిని మీరు బేకింగ్, కుకింగ్ లేదా కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వంటి వాటి కోసం వాడుకోవచ్చు. కొబ్బరినీళ్ళని నిల్వ ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

తాజా కొబ్బరినీళ్ళని ఒకరోజు లేదా రెండు రోజుల్లో తాగేయాలి. ఎక్కువగా మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిజ్లో స్టోర్ చేయొచ్చు. అప్పుడు ఒక వారం పాటు నిల్వ ఉంటాయి. అదే మీరు బాగా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రీజర్ లో ఐస్ క్యూబ్స్ ట్రే లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఈ సింపుల్ టిప్స్ ని మీరు ఫాలో అయ్యి కొబ్బరి నీళ్లను, కొబ్బరి కాయలను సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news