సీతారామ ప్రాజెక్టు…రేవంత్ సర్కార్ కు సీపీఎం వార్నింగ్ !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మంత్రి తుమ్మల క్రెడిట్ కోసం సీతారామ ప్రాజెక్ట్ అని హరీశ్ రావు పేర్కొంటే.. తుమ్మల కంట తడి పెడుతూ జిల్లా ప్రజలకు నీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కమీషన్ల కోసమే బీఆర్ఎస్ డిజైన్లు, ప్లేస్ మార్చారని.. హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యస్పదమని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్తగూడెం సీపీఎం పార్టీ కార్యాలయంలో ఎస్.కె.ఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా హడావుడిగా ప్రాజెక్టు ను ప్రారంభించడం ప్రభుత్వ మోసపూరిత చర్య అన్నారు. నీళ్ళు, భూములు మావి నీళ్లు ఇతర జిల్లాలకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ జిల్లాపై ముగ్గురు మంత్రుల సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని తీవ్ర విమర్శ చేశారు. డిజైన్ మార్చి దొడ్డి దారిన గోదావరి జలాలను ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు అంటూ ఆగ్రహం చెందారు. పాత డిజైన్ ప్రకారం పనులు చేపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైరా సభలో ముఖ్యమంత్రి పాత డిజైన్ ప్రకారం పనులు చేపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు నీళ్లు అందిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. లేనియెడల వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news