ఓటు వేశారా? ఓటు గుర్తు చూపిస్తేనే సెలవు.. లేదంటే జీతం కట్..!

-

చాలామంది సెలవు తీసుకొని ఓటేయకుండా హాలీడే ట్రిప్పులకు తిరుగుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు ఓటు రూల్స్ ను తీసుకొచ్చాయట.

దేశవ్యాప్తంగా ఇవాళ తొలి విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే.. ఎన్నికల సందర్భంగా ఇవాళ సెలవును ప్రకటించాయి ప్రభుత్వాలు. ఉద్యోగాలు చేసేవాళ్లందరికీ ఇవాళ సెలవు అన్నమాట. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అందుకే కంపెనీలకు సెలవు ఇవ్వాలంటూ ఆదేశించింది.

Have you voted in elections if not your one day salary will cut

ఓటింగ్ శాతం పెంచాలన్న సదుద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేటు ఉద్యోగులకు కంపెనీలు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించాయి. కంపెనీలు సెలవులయితే ఇచ్చాయి కానీ.. ఉద్యోగులను తీసుకెళ్లి ఓటేయించలేవుగా. అయితే.. చాలామంది సెలవు తీసుకొని ఓటేయకుండా హాలీడే ట్రిప్పులకు తిరుగుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు ఓటు రూల్స్ ను తీసుకొచ్చాయట.

ఓటు రూల్ ప్రకారం… ఎన్నికల రోజున ఓటింగ్ లో పాల్గొనకుండా సెలవు తీసుకునే ఉద్యోగికి ఆరోజు జీతం కట్ చేస్తారట. అయితే ఇది ప్రస్తుతం బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో అమలులో ఉంది. ఏప్రిల్ 18న బెంగళూరులో ఓటింగ్ ఉంది కదా. ఆ ఉద్దేశంలో వచ్చిన రూల్ అన్నమాట ఇది. ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కంపెనీ హెచ్ఆర్ కు ఆధారాలు సమర్పిస్తేనే ఆరోజున వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. ఓటేసినట్టు వేలుకు పెట్టుకున్న ఓటు మార్కును, పోలింగ్ స్లిప్ ను ఇలా ఏదో ఒక ఆధారాన్ని చూపించాలట. లేదంటే ఒక రోజు జీతాన్ని వదులుకోవాల్సిందే. ఎన్నికలకు వారం ముందు నుంచే కంపెనీలు తమ ఉద్యోగులకు ఓటింగ్ లో పాల్గొనాలంటూ అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news