శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఇప్పుడే తెలుసుకోండి.

-

శృంగారం కూడా వ్యాయామమే. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ జీవితంలో శృంగారాన్ని భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకున్నట్టే. అందుకే ఆరోగ్యకరమైన శృంగారం అన్నివిధాలా మేలైనది. శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని ఇప్పుడు తెలుసుకుందాం.

హృదయ సంబంధ వ్యాధులు రాకుండా

2015లో అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురణ అయిన దాని ప్రకారం శృంగారం వల్ల హృదయ సంబంధ వ్యాధులు ముప్పు తగ్గుతుంది. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొన్న వారిలో ఈ రిస్కు చాలా తక్కువగా ఉంది. అంతేకాదు నిమిషం పాటు శృంగారంలో పాల్గొన్న పురుషుల్లో నాలుగు కేలరీలు తగ్గుతాయి. అదే మహిళల్లో 3కేలరీలు ఖర్చు అవుతాయి.

నొప్పులను తగ్గిస్తుంది.

ఒకానొక పరిశోధనలో తమ భాగస్వామి ఫోటో లేదా ఎవరో ఒక అందమైన కొత్తవారి ఫోటోను చూపించినపుడు నొప్పి తగ్గిన భావన అందరిలోనూ కలిగింది. అంటే రొమాన్స్ కారణంగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చన్నమాట.

ఒత్తిడి తగ్గిస్తుంది

ఒత్తిడిని తగ్గించడంలో శృంగారం పాత్ర కీలకమైనది. శృంగారంలో పాల్గొన్నప్పుడు విడుదల్లయే ఎండార్ఫిన్ల కారణంగా ఒత్తిడి దూరం అవుతుంది. అంతే కాదు ఒత్తిడి తగ్గితే రక్తప్రసరణ సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

మెరుగైన నిద్ర

శృంగారంలో అనుభూతిని ఆస్వాదించాక అది మెరుగైన నిద్రకి దారి తీస్తుంది. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎంతో మంది నిద్ర సరిగ్గా పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు వారి శృంగార జీవితం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి.

సంతోషం, గట్టి బంధం

శృంగారం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. బంధాలు గట్టి పడడంతో ఆనందం ఎక్కువవుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news