వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి.. ఇలా చేయాలి..!

వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై డ‌బ్బులు పొదుపు చేయాల‌ని చూస్తున్నారా ? అయితే ఈ ఆఫ‌ర్ మీ కోస‌మే. వంట గ్యాస్ సిలిండ‌ర్ ద్వారా మీరు రూ.500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. ఇండేన్ లేదా భార‌త్ గ్యాస్ క‌స్ట‌మ‌ర్లు అయితే పేటీఎం ద్వారా రూ.500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. అందుకు ఈ స్టెప్స్ పాటించాలి.

here it is how you can get rs 500 cash back on booking lpg cylinder

1. మొబైల్‌లో పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయాలి.
2. హోం పేజీలో ఆప్ష‌న్ క‌నిపించ‌క‌పోతే షో మోర్ అనే ఆప్ష‌న్‌పై ట‌చ్ చేయాలి.
3. అనంత‌రం ఎడ‌మ వైపు రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయ‌గానే బుక్ ఎ సిలిండ‌ర్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై ట‌చ్ చేసి ఓపెన్ చేయాలి.
4. బుక్ సిలిండ‌ర్‌ను ఓపెన్ చేశాక అందులో మీ గ్యాస్ ప్రొవైడ‌ర్‌ను ఎంచుకోవాలి. భార‌త్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ క‌స్ట‌మ‌ర్లు ఆయా కంపెనీల‌ను ఎంచుకోవాలి.
5. అనంత‌రం రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌ర్ లేదా ఎల్‌పీజీ ఐడీని న‌మోదు చేయాలి.
6. ప్రొసిడీ బ‌ట‌న్‌పై ప్రెస్ చేయాలి. త‌రువాత వ‌చ్చే పేజీలో ఎల్‌పీజీ ఐడీ, క‌న్‌జ్యూమ‌ర్ పేరు, ఏజెన్సీ పేరు క‌నిపిస్తాయి. కింది భాగంలో గ్యాస్ సిలిండ‌ర్‌కు ఎంత మొత్తం అవుతుందో కూడా చూపిస్తుంది.

ఈ ప్ర‌క్రియ ద్వారా పేటీఎంలో కేవ‌లం మొద‌టి సారి గ్యాస్ సిలిండ‌ర్ ను బుక్ చేసేవారికి మాత్ర‌మే రూ.500 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. ఇందుకుగాను క‌స్ట‌మ‌ర్లు FIRSTLPG అనే ప్రోమో కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. గ్యాస్ బుకింగ్ స‌మ‌యంలో ఈ కోడ్‌ను ఎంట‌ర్ చేయ‌క‌పోతే ఆఫ‌ర్‌ను కోల్పోతారు. ఇక ఈ ఆఫ‌ర్‌ను క‌స్ట‌మ‌ర్లు కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఉప‌యోగించుకునేందుకు వీలుంటుంది. గ‌రిష్టంగా రూ.500 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తారు. ఈ ఆఫ‌ర్ డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.