హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నానాటికీ పెరిగిపోతున్నాయి. యువతలను సరిహద్దులు దాటించి వ్యభిచార రొంపిలోకి లాగుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్లాన్ చేస్తూ ఈ దురాక్రమణకు పాల్పడుతున్నాయి. బంగ్లాదేశ్ యువతుల విషయంలో ఈ ముఠాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి భారతదేశంలోని కోల్ కతా రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు ఉంచుతున్నారు. గుర్తింపు కార్డులు తయారీ చేసి వ్యభిచారంలోకి లాగుతున్నారు.
అమాయక మహిళలను సరిహద్దులు దాటించి దేశంలోకి తీసుకురావడం, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ అక్రమ రవాణా ముఠాలో కొందరు పేరుకు భారతీయులైనా వారి మూలాలు బంగ్లాదేశ్ లో కనిపిస్తుంటాయి. అంటే వీరు బంగ్లాదేశ్ నుంచి చాలా ఏళ్ల కిందటే వచ్చి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది ఉంటారు. బంగ్లాదేశ్ లో తమ సంబంధీకులతో సంబంధాలు కొనసాగిస్తూ ఈ వ్యభిచార దందాను నడిపిస్తున్నారు.
2019లో బయటపడ్డ పహాడీషరీఫ్ సెక్స్ రాకెట్ బంగ్లాదేశ్ కు చెందిన దంపతులు సూత్రధారులు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ లో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్ సూత్రధారి లిటన్ సర్కార్ కూడా బంగ్లాదేశ్ వాసి కావడం గమనార్హం. భారతదేశానికి అక్రమంగా రవాణా చేసే యువతుల్లో ఎక్కువగా బంగ్లాదేశ్ దక్షిణ భాగానికి చెందిన వారు అధికం. వీరు ఇండియాకు సమీపంలో ఉండటం, బంగ్లా దక్షిణాన రోహింగ్యాలు ఉండటం కూడా ఈ ముఠాకు కలిసోస్తుంది. బెంగాల్ లో దక్షిణ భాగానా ఉన్న ‘ఉత్తర 24 పరగణా’ జిల్లా నుంచి యువతులను దేశంలోకి తీసుకొస్తున్నారు. కేవలం 80 కి.మీ దూరం కావడంతో రాత్రికి రాత్రే దేశంలోకి చొరబడుతున్నారు.
అలా దేశంలోకి తీసుకొచ్చిన యువతను వ్యభిచార కూపంలోకి దింపుతారు. కోల్ కతాలో వీరికి పేర్లు మర్చి స్థానికులుగా చెలామణి అయ్యేలా గుర్తింపు కార్డులు, సిమ్ కార్డులు అందజేస్తారు. దేశంలో ఎక్కడ పట్టుబడినా బెంగాల్ గుర్తింపు కార్డులే లభిస్తాయి. హైదరాబాద్ పోలీసులు పలు వేశ్యవాటికలపై దాడులు నిర్వహించగా.. భారత గుర్తింపు కార్డులు లభించడం సంచలనం రేపుతున్నాయి. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ సెక్స్ రాకెట్ విషయంలోనూ బాధిత మహిళల పేర్లు మార్చి భారతీయులుగా చెలామణి చేసినట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు.