హై హీల్స్ మొదట కనిపెట్టింది ఆడవారికోసం అసలు కాదట..దాని వెనుక కథవేరుంది..!

-

హై హీల్స్ అంటే..మనకు ఇప్పటివరకూ తెలిసింది అవి ఆడవాళ్లే వేసుకుంటారని. హై హీల్స్ ని అందరూ అమ్మాయిలు కారీ చేయలేరు. అవి వేసుకోవటం రాకపోతే..కాళ్లనొప్పులు రావటం కాయం.. అయినా సరే అమ్మాయిలకు మాత్రం వాటిపైన ఇష్టం మాత్రం పోదు. ట్రెండీ జీన్స్ పైన మంచి టాప్ వేసుకుని దానికి మ్యాచింగ్ హీల్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరు. హీల్స్ ఆడవారి ఫ్యాషన్ ప్రపంచంలో ఒక భాగం అయిపోయాయి. కానీ వీటిని కనిపెట్టింది ఆడవారికోసం కాదట. దీని వెనుక అసలు కథ ఏంటో చూద్దాం.

హై హీల్స్ ను పురుషుల కోసమే రూపొందించారట. 10 వ శతాబ్దంలో పెర్షియన్ సైనికులు వారి పాదాలను పైకి లేపడానికి హై-హీల్డ్ బూట్లు మొదట ధరించారు. వారు విల్లు బాణాలను ఉపయోగించేవారు. ఈ సమయంలో వారికి పట్టుకోసం ఇలాంటి షూస్ ను ఉపయోగించారట. అప్పటి నుంచి వీటిపై పురుషులకు ఆసక్తి పెరిగి కొంతకాలం వరకు ట్రేండింగ్ లో కూడా ఉన్నాయి.

బాగా డబ్బున్న వారు, పెర్షియన్ సైనికులు వీటిని ఎక్కువ గా వినియోగించేవారట. లూయిస్ 15వ రాజు కూడా కింగ్ ఆఫ్ హీల్స్ గా పిలవబడేవారట. అతను రకరకాల హీల్స్ ధరించేవారట అందరి ఆసక్తి ఆ రాజు వేసుకునే హీల్ పైనే ఉండేదట. కానీ 1670లో ప్రభువులు మాత్రమే హై హీల్స్ ధరించాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారట. ఆయన ఎక్కువగా ఎరుపు రంగు బూట్లు ధరించేవారట. ఆయనతో పాటు ఆయన సభలో సభ్యులకు ఎరుపు రంగు బూట్లు ధరించడానికి అనుమతి ఉండేదట.

ఆ కాలంలోనే.. స్త్రీలు కూడా పురుషుల ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడానికి ఆరాటపడ్డారు. హెయిర్ ను కత్తిరించుకోవడం, టోపీలు పెట్టుకోవడం వంటి వాటిని ఫాలో అవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆడవారికి అప్పటినుంచే పోటీతత్వం ఉండేదేమో.. ఆ క్రమం లోనే హై హీల్స్ ను స్త్రీలు కూడా ధరించడం ప్రారంభించారు. అయితే.. స్త్రీల పాదాలు పురుషుల పాదాల కంటే కొంత చిన్నవిగా ఉండటంతో వారికీ ప్రత్యేకంగా హీల్స్ ను రూపొందించడం ప్రారంభమైంది.

17 వ శతాబ్దం వచ్చేసరికి పురుషుల వస్త్రధారణలో కూడా మార్పులు వచ్చాయి. రంగురంగుల బట్టలు, ఆభరణాలు వంటివాటిని ధరించడం తగ్గించారు. మరో వైపు ఆడువారు వీటిని ధరిస్తూ వచ్చారు. దీనితో.. ఇద్దరి వస్త్రధారణలోను బేధాలు వచ్చాయి. హై హీల్స్ ఎక్కువ స్త్రీలు వాడడం ప్రారంభించారు. 1740 నాటికి, పురుషులు హై హీల్స్ ను వేసుకోవటం పూర్తిగా మానేశారు. 19 వ శతాబ్దంలో తిరిగి హీల్స్ పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చినా.. తక్కువ ఎత్తు ఉన్న హీల్ షూస్ ని మాత్రమే పురుషులు వినియోగిస్తున్నారు.

ఇలా పురుషులకోసం కనిపెట్టినవి కాలం మారేకొద్ది పూర్తిగా ఆడవారికోసం తయారుచేయబడ్డాయి..అలా ప్రస్తుతం హై హీల్స్ ఆడవారికికోసమే తీసుకొచ్చినట్లు మారిపోయింది. ఆ కాలంలో పురుషులు ఎవ్వరూ కూడా హై హీల్స్ ని వేసుకోవటానికి ఆసక్తి చూపరు.

–Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news