అసలు పేలు ఎలా వచ్చాయి?ఎక్కడ పుట్టాయో తెలుసా?

-

పేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పేలు మనుషుల రక్తం పీల్చె కీటకాలు..ఈ పేలు ఎక్కువగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని జీవిస్తుంది. మనిషి తలలోని వెంట్రుకల్లో దాక్కుని పేను రక్తం పీల్చి జీవిస్తుంటుంది. అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల నుండి 1.20 కోట్ల మంది పేలు బాధితులని తెలుస్తుంది. పేను మానవులకు పెద్దగా హాని కలిగించనప్పటికీ.. మనిషి జుట్టులో నివసించే ఈ కీటకం మానవ రక్తాన్ని పీలుస్తూ జీవిస్తుంది. ఈ పేలు ఎగర లేదు లేదా నీటిలో జీవించదు. అయితే ఇది జుట్టులోకి ఎక్కడ నుండి వస్తుంది? ఈ పురుగు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టిందినేది చాలామందికి తెలియదు..దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దీని పరిమాణం 2-3 మిమీ. పేనుకి రెక్కలు ఉండవు. ఓవల్ బ్రౌన్ రంగులో ఉంటుంది. పేను సుమారు 30 రోజులు నివసిస్తుంది. ఆడ పెను ప్రతిరోజూ దాదాపు 6 గుడ్లు పెడుతుంది. వీటిని నిట్స్ ఈపులు అని పిలుస్తారు. ఇవి తెల్లగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడ్లు రెండు వారాల్లో పెలుగా పరిపక్వం చెందుతాయి. ఈ ప్రక్రియ నిరాతరం కొనసాగుతుంది..పేను జాతి సుమారు 1 లక్ష సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. పేనులు వాటి జన్యు నిర్మాణం ఆధారంగా క్లాడ్‌లుగా విభజించబడ్డాయి, వాటి ఆధారంగా వాటిని A, B, C అని పిలుస్తారు. జర్నల్ ఆఫ్ పారాసిటాలజీ ప్రకారం.. క్లాడ్ Bపేను ఉత్తర అమెరికాలో జన్మించినట్లు తెలుస్తోంది. తరువాత అవి యూరప్, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరుకున్నాయి..
నివారణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి. పెద్ద పేను చనిపోతుంది. అయితే ఆడ పేను చనిపోయే ముందు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు మళ్లీ పేనుగా మారతాయి. వీటిని వదిలించుకోవడానికి ఏకైక మార్గం సజీవంగా ఉన్నప్పుడే పేలను, వాటి గుడ్లను రెండింటినీ ఏకకాలంలో నివారించాల్సి ఉంటుంది.

తలలోని పేనులను తొలగించడానికి చక్కటి దువ్వెనను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక పేలను నివారించే షాంపులు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి షాంపులు ఉపయోగించడం వలన పేలు జుట్టులో చనిపోతాయి. అనంతరం తలను దువ్వడం ద్వారా సులభంగా తొలగించబడతాయి. పేనులతో పాటు.. ఈ పేలను నాశనం చేయడం అవసరం. సమస్య ఎక్కువగా ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది..లేకుంటే తలను గోకి గోకి చర్మం ఊడిపోతుంది..జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news