దెయ్యాలు ఇంట్లో ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి…!

-

How to find out ghost in home when you are alone

దెయ్యాలు.. అసలు ఉంటాయా? ఉండవా? దెయ్యాలు ఉండటమేంది.. అంతా ట్రాష్. ఎహె.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు కూడా ఉంటాయి. ఇలా వంద రకాల సందేహాలు. అదో పెద్ద కాన్సెప్ట్. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది పక్కన బెడదాం. ఒకవేళ దెయ్యాలు ఇంట్లో ఉన్నాయని అనిపిస్తే ఎలా? సినిమాల్లో చూపించినట్టుగా దెయ్యాలు ఇంట్లో ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి…

మీ ఇంటి పక్కన కానీ.. మీ ఇంటి చుట్టు పక్కన ఉన్న ఇళ్లలో పిల్లలు ఎవరూ లేకపోయినా… పిల్లలు ఏడ్చినట్టు రాత్రి పూట వినిపించిందనుకోండి… మీ ఇంటి పరిసరాల్లో దెయ్యం సంచరిస్తున్నదని అర్థం. మీ ఇంట్లో పిల్లలు ఏడుపు వినిపిస్తే.. దెయ్యం మీ ఇంట్లో ఉన్నట్టే.

మీ పక్కన ఎవరూ లేకున్నా… ఎవరో ఉన్నట్టు మీకు అనిపించినా… మిమ్మల్ని ఎవరో తాకినట్టు అనిపించినా.. అక్కడ దెయ్యం ఉన్నట్టే అనుకోవాలి.

మీ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతే… చల్లగా మారిపోతే అక్కడ దెయ్యమో లేదా ఏవైనా అతీతశక్తులు ఉన్నట్టే.

రాత్రి వేళలో కుక్కలు కానీ.. వేరే జంతువులు కానీ భయంకరంగా అరుస్తాయి. అలా అరిస్తే.. అక్కడ ఏదో ఉన్నట్టే. దెయ్యమో.. భూతమో ఉన్నట్టే. అవి జంతువులకు కనిపిస్తాయి. అందుకే అవి అరుస్తాయి.

మీరు మీ ఇంటిని ఎంత శుభ్రం చేసినా.. మీ ఇంట్లో నుంచి ఏదైనా మురుగుడు వాసన లేదా.. భరించరాని చెడు వాసన వస్తే.. మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టే అంటారు.

మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. నిచ్చెన ఎక్కుతున్నటువంటి శబ్దం లేదా మెట్లు ఎక్కుతున్న శబ్దం, శ్వాస పీలుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తే.. ఆ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నట్టే అని చెబుతుంటారు.

స్విచ్చులు వేయకున్నా.. మీ ఇంట్లోని లైట్లు, బల్బులు వాటంతట అవే వెలిగితే.. ఏదో నెగెటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నట్టే.

మీ పక్కన ఎవరూ లేకున్నా… చుట్టు పక్కన ఎవరూ లేకున్నా.. ఎవరో పిలిచినట్టు మీకు అనిపిస్తే.. అక్కడ దెయ్యం ఉన్నట్టేనంటున్నారు.

(నోట్: దెయ్యాలు ఉన్నాయనో.. లేదా రీడర్స్ ను భయపెట్టడమో ఈ కథనం ఉద్దేశం కాదు.. ఇవన్నీ దెయ్యానికి సంబంధించి పరిశోధన చేస్తున్న వాళ్లు అందించినవి. ఈ వార్త మూఢనమ్మకాలను ఎంత మాత్రం ప్రోత్సహించదు. కేవలం అవగాహన కోసం రాసిన వార్త ఇది. ఈ వార్తలోని అంశాలకు, వెబ్ సైట్ కు ఎటువంటి సంబంధం లేదు.)

Read more RELATED
Recommended to you

Latest news