ఈ విషయాల ద్వారా అవతలి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు..

-

ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారనే ఫీల్ అవుతుంటాం. కానీ అది నిజంగా ప్రేమేనా కాదా అని తెలుసుకోవడం ఎలా? మీ ప్రేమ ప్రకటించేటపుడు అవతలి వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతారన్న విషయం ముందే తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా ఒకరిపై ప్రేమ కురిపిస్తున్నప్పుడు, ఆ విషయాన్ని అవతలి వారితో చెప్తే, వారు కూడా యెస్ అని చెప్పాలనే భావిస్తారు. నో అంటారని అస్సలు అనుకోరు. అవతలి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారన్న భావం కొంచెం కూడా లేకపోతే అస్సలు ప్రేమించలేరు.

ఐతే అవతలి వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

మిమ్మల్ని ప్రేమించే వారు మీకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎంత మందిలో ఉన్నా కూడా ఆ ప్రాధాన్యం బయటకి కనిపిస్తూ ఉంటుంది.

మీ అభిప్రాయాలకి ఎక్కువ గౌరవం ఇస్తారు. మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తారు. ఏది చెప్పినా అత్యంత శ్రద్ధతో వింటారు.

ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అంటూ అందమైన మెసేజ్, రాత్రి నిద్రలోకి జారుకునేటపుడు గుడ్ నైట్ అంటూ మెసేజ్..

మిమ్మల్ని చూడగానే వారి కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పక్కన ఉన్నప్పుడు ఉత్సాహం రెట్టింపవుతుంది.

మీ కష్ట సమయాల్లో అండగా నిలుస్తారు. ఇబ్బందులు ఎదురైనపుడు మాటలు చెప్పకుండా చేతనైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు.

వారి పక్కన ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వారు కూడా ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు.

సద్విమర్శని చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. మీలో ఏ లోపం ఉన్నా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అదో పెద్ద లోపంగా దాన్ని భావించరు.

Read more RELATED
Recommended to you

Latest news