ఉమ్మి వేసినందుకు వారికి ఫైన్.. ఎంతో తెలిస్తే మీరు భయపడిపోతారు..!

-

సాధారణంగా ఇండియాలో ఉమ్మివేడయం కామనే. ఎక్కడ పడితే అక్కడ కొందరు విచక్షణా రహితంగా ఉమ్మివేయడం మనం చూడొచ్చు. అయితే, ఇండియాలోని ఆ ప్రాంతంలో మాత్రం ఉమ్మివేయడం నేరమే. ఉమ్మి వేసినందుకుగాను ఫైన్ వేస్తారు. తాజాగా ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించారు. అదెక్కడో తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

Spitting in public

గతంలో మాదిరిగానే ప్రస్తుతం కొవిడ్ భయానక పరిస్థితులు ఏర్పడబోతున్నాయని నమోదవుతున్న కరోనా కేసులను బట్టి అంచనా వేసుకోవచ్చు. ఇకపోతే కరోనా థర్డ్ వేవ్ ముంపు అతిత్వరలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అందరూ సూచిస్తున్నారు. కాగా, కొందరు రోడ్లు, ఇతర ఓపెన్ ప్లేసెస్‌లో ఉమ్మివేస్తున్నారు. బాధ్యత లేకుండా వారు ఇలా చేస్తుండటం ద్వారా కరోనా వ్యాప్తి అయ్యే అవకాశాలున్నాయి.

ఈ నేపథ్యంలోనే అధికారులు పలు చర్యలకు పూనుకున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు బాధ్యత లేకుండా ఉమ్మివేస్తున్న వ్యక్తుల పట్ల కఠినంగానే ఉంటున్నారు. వారి వద్ద నుంచి ఫైన్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 19,000 మంది వ్యక్తుల నుంచి రూ.39 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముంబై సిటీలో ఉంటున్న జనాల రక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు సంగీత వివరించారు. ఈ సంగతులు ఇలా ఉండగా ముంబై సిటీలో కొవిడ్ కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.

అయితే, కొంత మంది ఇవేవీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వారిలో ఒక్కరికి భయంకరమైన న్యూ కొవిడ్ వేరియంట్ డెల్టా సోకితే ఇక అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు మస్ట్‌గా ధరిస్తూ, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version