రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయాన్ని లేచి పండుగ వేడుకల్లో మునిగిపోయారు. ఇక ప్రభుత్వాలు అధికారికంగా పంచాంగ శ్రవణ వేడుకల్లో పాల్గొనగా.. ఆయా పార్టీలు, ఎమ్మెల్యేలు తమ క్యాంప్ ఆఫీసులు, కుటుంబాలతో కలిసి ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.‘ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతన్నలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ..శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతన్నలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ
శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన… pic.twitter.com/YVLMuCDf2e
— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025