వీటి వలన మనుష్యులు కృంగిపోతారు.. మరి ఆ సమస్యలు ఏమిటంటే..?

-

మన జీవితంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఏది వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము, ఊహించలేము. అయితే జీవితంలో ఈ విషయాలు కనుక ఎదురయ్యాయి అంటే మనిషి లోలోపలే కుంగిపోతాడు. అయితే అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆచార్య చాణక్య చాణక్య నీతి లో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. మరి ఆ ముఖ్యమైన విషయాల గురించి ఒక లుక్కేయండి.

మూర్ఖత్వం:

నిజానికి మూర్ఖత్వం అనేది ఒక పెద్ద వ్యాధి అని ఆచార్య చాణక్యుడు అన్నారు. మూర్ఖుడు కానీ పద్ధతిగా నడుచుకొని వ్యక్తి కానీ తల్లిదండ్రులకి బాధని కలిగిస్తాడు అలాగే తన మాటలతో అందరిని ఇబ్బందులకు గురి చేస్తాడు.

గయ్యాళి భార్య:

భార్య గయ్యాళి గా ప్రవర్తిస్తే భర్త ఎవరికీ చెప్పకుండా ఆందోళనకి గురి అవుతూ ఉంటాడు. అలాంటి భార్యతో కాపురం చేసే భర్త లోలోపలే కుంగిపోతాడు. పైగా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. దీనితో ఇంట్లో దేవతల కూడా రారు అని అంటున్నారు.

నీచులు సహవాసం తో నరకం:

నిజమైన పనులు చేసే వాళ్ళకి ఈ సేవ చేయడం అధర్మంగా పరిగణించాలని పేర్కొన్నారు ఆచార్య చాణక్య. చెడు చేసే వాళ్ళు ఎప్పుడూ కటువుగా మాట్లాడతారు అలాంటి వాళ్ల తో సహవాసం చేయడం ద్వారా దుర్మార్గపు లక్షణాలు వస్తాయి.

కుమార్తె వితంతువు కావడం:

కుమార్తె కనుక వితంత గా మారితే తండ్రి ఆమెను అటువంటి పరిస్థితిలో చూడలేడు అని చెప్పారు. కూతురు సంతోషంగా లేనప్పుడు తండ్రి లోలోపలే కుంగిపోతాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version