హైదరాబాదీయులు నిజంగా చాలా సంతృప్తిగా ఫీలవ్వాల్సిన వార్త ఇది. ఎందుకంటే.. హైదరాబాద్‌లోని ప్రజలకు సరఫరా అయ్యే నల్లా నీరు చాలా సురక్షితమైందని, సేఫ్టీలో ఈ నీరు దేశంలోనే రెండో స్థానంలో ఉందని వెల్లడైంది.
హైదరాబాదీయులు నిజంగా చాలా సంతృప్తిగా ఫీలవ్వాల్సిన వార్త ఇది. ఎందుకంటే.. హైదరాబాద్‌లోని ప్రజలకు సరఫరా అయ్యే నల్లా నీరు చాలా సురక్షితమైందని, సేఫ్టీలో ఈ నీరు దేశంలోనే రెండో స్థానంలో ఉందని వెల్లడైంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల సంబంధాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఓ నివేదికను విడుదల చేశారు. అందులో ఏముందంటే…
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోని పలు ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నల్లా నీటిని సేకరించి వాటి సేఫ్టీపై ల్యాబొరేటరీలో ప్రయోగాలు జరిపింది. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. దేశంలో ముంబైలో సరఫరా అవుతున్న నల్లా నీరు అత్యంత సురక్షితమైందని, దానికి సేఫ్టీలో దేశంలో మొదటి స్థానం లభించిందని, ఆ తరువాతి స్థానంలో హైదరాబాద్ ఉందని వెల్లడైంది.
ఇక దేశంలో ఉన్న 21 నగరాల్లో అత్యంత అసురక్షితమైన నల్లా నీటిని సరఫరా చేస్తున్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని ఆ నివేదికలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆ నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి పాశ్వాన్ మాట్లాడుతూ.. దేశంలో ఆయా నగరాల్లో లభిస్తున్న నల్లా నీరు ఎంత సురక్షితమైందో ప్రజలకు తెలియజేసేందుకే ఈ పరీక్షలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఆయా నగరాల్లో లభ్యమయ్యే నీటి సేఫ్టీని పరీక్షించడం కోసం తాము 28 అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆ తరువాతే నీటి సేఫ్టీపై నివేదికను తయారు చేశామని వెల్లడించారు.