ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలు అబ్బాయిలకి బాగా నచ్చుతారు..

అబ్బాయిలకి అమ్మాయి నచ్చాలంటే అందంగా ఉంటే సరిపోతుంది కదా, మళ్ళీ ప్రత్యేకించి లక్షణాలు ఎందుకని ఆలోచిస్తున్నారా? మీరనుకున్నది నిజమే. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల అందం చూసే ఇష్టపడతారు. ఐతే అది ఆకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణ స్నేహానికి దారి తీస్తుందే కానీ ప్రేమకి కాదు. అమ్మాయి అందంగా కనిపించగానే మాట్లాడాలనీ, స్నేహం పెంచుకోవాలనీ ఆలోచిస్తారు. ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడి, స్నేహం పెరిగాక ఆకర్షణ తగ్గిపోతుంది. అందుకే చాలా మంది అమ్మాయిలు మాట్లాడడానికి ఇష్టపడరు.

అదలా ఉంచితే అమ్మాయిల్లో ఏ లక్షణాలుంటే అబ్బాయిలకి నచ్చుతారో చూద్దాం. ఇక్కడ ఆకర్షణని పక్కన పెట్టాలి.

ఇండిపెండెంట్

తమ పని తాము చేసుకుంటూ ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండేవారిని అబ్బాయిలు బాగా ఇష్టపడతారు.

ప్రతీదానికి ఇతరుల ఆధారపడడం కంటే సొంతంగా పని చేసుకునే వాళ్ళు బాగా నచ్చుతారు.

చాలా మందికి తెలియని విషయమేంటంటే, పొగడ్తలకి అమ్మాయిలే పడతారని అనుకుంటారు. కానీ, అబ్బాయిలు చాలా ఈజీగా పడిపోతారు. అమ్మాయిలు పొగుడుతుంటే అబ్బాయిలకి గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఐతే అందంగా పొగడడం అనేది అమ్మాయిలకి రాని విద్య.

బుజ్జగించడం కొన్నిసార్లు బాగానే ఉంటుంది. అదే పనిగా ప్రతీసారీ బుజ్జగించాలని అమ్మాయిలు భావిస్తే అబ్బాయిలకి చిరాకు కలుగుతుంది. దాంతో అరుస్తారు. అప్పుడే గొడవ మొదలవుతుంది.

సున్నితంగా ఉండే అమ్మాయిలని అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. సినిమాల్లో చూపించినట్టు అమ్మాయిలందరూ సున్నిత మనస్కులే కదా అనుకుంటే పొరపాటే. అమ్మాయిల్లోనీ కఠినత్వం బయటకి కనపడదు అంతే. అందుకే కఠినంగా ఉండే అమ్మాయిలతో స్నేహం చేయడానికి అబ్బాయిలు ఆసక్తి చూపరు.