బంగారం కొంటే.. గోల్డ్‌ కాయిన్స్‌ ఉచితం!

మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు గోల్డ్‌ కొనాలనుకుంటే ఇది మీకు శుభవార్తే.. బంగారం కొనే వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ రోజుల్లో బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే మీరు రూ.25 వేల బంగారం కొంటే దానికి ఉచితంగా గోల్డ్‌ కాయిన్స్‌ పొందవచ్చు. కానీ, ఈ ఆఫర్‌ మే 14న మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆశ్చర్యపోకండి ఇది నిజమే! బంగారం కొంటే గోల్డ్‌ కాయిన్స్‌ మీరు ఫ్రీగా పొందవచ్చు. అయితే, అది ఎక్కడా? ఎలా? తెలుసుకుందాం. ఈ ఆఫర్‌ను కల్యాణ్‌ జువెలర్స్‌కు చెందిన కాండెరే బ్రాండ్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మీరు రూ.25 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన బంగారు ఆభరణాలు కొనాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఉచితంగా గోల్డ్‌ కాయిన్స్‌ను పొందవచ్చు. కానీ, ఈ ఆఫర్‌ కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మే 14న అక్షయతృతి రానుంది. కాబట్టి ఆ రోజు బంగారం కొంటే సకల శుభాలు జరుగుతాయని, మంచిదని అందరూ విశ్వసిస్తారు. చాలా మంది వినియోగదారులకు కూడా ఒక ముక్కు పుడకంత బంగారం అన్న కొనడానికి ప్రయత్నిస్తారు. అందుకే జువెలరీ సంస్థలు ఆరోజు కోసం ఇప్పటి నుంచే ఆఫర్లు వెల్లడిస్తున్నాయి. మరికొన్ని జువెలరీ సంస్థలు ఎంత బంగారం కొంటే.. అంత వెండి ఉచితం అని కూడా గతంలో ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే మార్కెట్లో ప్రస్తుత బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.48,160కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 క్షీణతతో రూ.44,150కు తగ్గింది. వెండి కూడా తగ్గుమఖం పట్టింది.