ఎప్పటికప్పుడు బాత్రూం ని క్లీన్ చేస్తున్నా.. ఎప్పుడూ మురికిగానే బాత్రూం కనబడుతూ ఉంటోందా బాత్రూం మురికిగా ఉండడం వలన రకరకాలు జబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడూ కూడా వెంటనే బాత్రూం ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చాలామంది బాత్రూం శుభ్రం చేసేటప్పుడు బాత్రూంలో ఉండే టైల్స్ పై పేరుకుపోయిన మురికిని తొలగించడం మర్చిపోతూ ఉంటారు దీని వలన చూడడానికి బాగోదు సరి కదా అవి వివిధ రకాల జబ్బులు వస్తాయి.
ఒక్కొక్కసారి బాత్రూం టైల్స్ మీద మచ్చలు అలా ఉండిపోతు ఉంటాయి చూడడానికి అసహ్యంగా కనబడుతూ ఉంటుంది. ఎంత కష్టపడి క్లీన్ చేయాలన్నా కూడా అవి పోవు. అయితే మొండి మరికల్ని తొలగించాలంటే ఈ పద్ధతిని పాటించండి. ఇలా క్లీన్ చేశారంటే మరకలు మచ్చలు అన్నీ మాయమవుతాయి. కొత్త టైల్స్ లాగ మెరిసిపోతాయి.
బాత్రూం టైల్స్ మీద పేరుకుపోయిన మురికిని క్లీన్ చేయడానికి ఇకమీదట శ్రమ పడక్కర్లేదు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రెండు స్పూన్ల బేకింగ్ సోడా తీసుకోండి అందులో రెండు స్పూన్లు డిటర్జెంట్ పౌడర్ని వేయండి కొంచెం బాత్రూం క్లీనర్ ని కూడా మీరు ఉపయోగించండి. ఈ మూడు మిక్స్ చేసి మీరు బాత్రూం టైల్స్ మీద రుద్దండి. బేకింగ్ సోడాని వేయడం వలన మరకలు మురికి త్వరగా మాయమైపోతాయి కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఒకవేళ కనుక మరకలు ఇంకా కనబడుతున్నట్లయితే మళ్లీ ప్రాసెస్ ని రిపీట్ చేయండి ఇలా సులభంగా మనం బాత్రూం టైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు.