వేసవికాలం వస్తే చాలా వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నా ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. కాగా తాజాగా కూల్ డ్రింక్స్ గురించి ఒక ప్రమాదకర వార్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోకాకోలా, థమ్స్ అప్, స్ప్రైట్ , మాఝా వంటి కూల్ డ్రింక్స్ కంపెనీ లలో పనిచేసే కొందరు వ్యక్తులు పనై గట్టుకుని ఎబోలా వైరస్ సంక్రమించిన వ్యక్తుల రక్తాన్ని డ్రింక్స్ లో కలిపారని.. కాబట్టి కొన్ని రోజుల వరకు ఈ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయం అటు ఇటుగా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలియడంతో వెంటనే.. PIBFACTCHECK అన్ని విధాలుగా విచారణ చేయడంతో ఈ వార్త పూర్తిగా ఫేక్ అని తేలింది.
సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తలు నిజం కావు. నమ్మే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకోవాలని ప్రభుత్వం నెటిజన్లకు సూచించింది.