చాలామంది భార్య భర్తలు వైవాహిక జీవితం లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ లేదంటే ఏదో ఒకటి డిస్కషన్ వంటిది జరుగుతూ ఉంటాయి. ఆచార్య చాణక్య మన లైఫ్ లో జరిగే చాలా విషయాల గురించి ఎంతో చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే వైవాహిక జీవితంలో ఆనందమే ఉంటుంది. చాణక్య చెప్పినట్లు అనుసరిస్తే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు మొదట ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ మధ్య ప్రేమ దృఢంగా ఉంటే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి.
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం కొన్ని సూచనలని చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం… భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య అన్నారు. భర్త తనకి లభించే గౌరవం భార్యకి కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. భర్తకి భార్యకి మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. అలానే కష్టాలు లేదంటే ఇబ్బందులు వంటివి వచ్చినప్పుడు పురుషులు వాళ్ళ భార్యతో చర్చించాలి ఇలా చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.
భార్యాభర్తల మధ్య బంధం కూడా దృఢంగా ఉంటుంది చాలామంది పురుషులు భార్యని అందరి మధ్య తిడుతూ ఉంటారు. అలా చేయడం వలన వారి బంధం బలహీనమవుతుంది ఎప్పుడూ కూడా ఇతరుల ముందు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఏదైనా తప్పు జరిగితే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప అందరూ ముందు మాట్లాడుకోకూడదు.
జీవిత భాగస్వామి కనుక ఏదైనా తప్పు చేస్తే తిట్టడం కంటే ఆమె చేసిన తప్పు ఆమెకే అర్థమయ్యేలా చెప్తే బంధం బాగుంటుంది. అడుగడుగునా నేను ఉన్నాను అనే భరోసా భర్త స్త్రీకి ఇస్తే ఏం జరిగినా కూడా ఆ జంట కలకాలం కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య బంధం ఎంతో బాగుంటుంది చాణక్య చెప్పినట్లు చేస్తే వాళ్ళ మధ్య సమస్యలు ఉండవు.