పండగొచ్చిందా.. ఇవి పాటిస్తే టైమ్​ సేవ్​, ఎంచక్కా అందంగా ముస్తాబవచ్చు

-

ఏదైనా పండగొచ్చిందంటే చాలు.. మనకు పని, పూజ, ఇల్లు అలంకరణ.. ఇలా బోలెడుంటాయి. ఆ పని ఈ పని అంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాం. తీరా ఈ పనులన్నింటితో మనం ముస్తాబు అవ్వడానికే సరైనా సమయమే ఉండదు. అంతా హడావుడిగా అయిపోతుంది. లేదా ఆలస్యమవుతోందని ఇంట్లో వాళ్ల గోల. మరి రేపు వినాయక చవితి కదా.. మరి ఆలస్యం అవ్వకకుండా ఎంచక్కా అందంగా తయారై పూజకు సిద్ధమవ్వాలంటే ఈ చిట్కాలు పాటించేయండి..

దుస్తులు ఏవి వేసుకోవాలో ముందురోజే నిర్ణయించేసుకోండి. సరిపోతున్నాయా, ఇస్త్రీ అవసరమా వంటివీ చెక్‌ చేసుకుంటే మరుసటి రోజు ఇబ్బందులుండవు. చీర పిన్నుల దగ్గర్నుంచి గాజుల వరకూ అన్నింటినీ పక్కన పెట్టుకోండి. సరిపోయే నగల్నీ సరి చూసుకుంటే తక్కువ సమయంలో సిద్ధమైపోవచ్చు.

పండగలంటే బంధువులు, ఫొటోలు వంటివి సాధారణమే. హెయిర్‌ స్టైల్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నారా? మరీ క్లిష్టమైన వాటి జోలికి వెళ్లకండి. సులువుగా పూర్తయ్యేవాటిని ముందే నిర్ణయించేసుకుంటే తర్వాతిరోజు ఎలా వేసుకోవాలన్న సంశయముండదు.

పూజ వంటి విషయాల్లో అందమే కాదు.. హుందాగానూ కనిపించాలి. అప్పుడే సంప్రదాయ లుక్‌ వస్తుంది. తక్కువ మేకప్‌కు ప్రాధాన్యమివ్వండి. మాయిశ్చరైజర్‌ తర్వాత కాస్త బీబీ క్రీమ్‌, కళ్లకు కాటుక, ఐలైనర్‌, పెదాలకు లిప్‌బామ్‌/ లిప్‌స్టిక్‌ వరకూ పరిమితమైతే చాలు. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు చక్కగా నప్పుతుంది.

ముందురోజు రాత్రి సమయముంటే కొంగునూ సెట్‌ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు కట్టుకోవడం సులువవుతుంది. ఉదయాన్నే కూడా.. పూజకు కావాల్సినవన్నీ పొందిగ్గా సర్దుకున్నాకే చీరకట్టడంపై దృష్టిపెట్టండి. అప్పుడు కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.

Read more RELATED
Recommended to you

Latest news