పెళ్లి ప్రతి మనిషి జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతుంది. సాఫీగా సాగిపోయే జీవితంలోకి ట్విస్ట్‌లు, టెన్షన్‌లు, ఆనందాలు అబ్బో ఒకెటేంటీ.. ప్రతి సీను క్లైమాక్స్‌లా చేసుకునే పెద్ద కాన్సప్ట్ ఏంట్రా అంటే పెళ్లే..రెండు మనుసులు ఒక్కైటే చేసే ఈ కాపురంలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అమ్మాయిలు పెళ్లికి ముందు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో అని తెగ కలలు కంటారు. కానీ వాళ్లు అనుకున్నట్లు భర్త రాకపోవచ్చు, అలాగే అబ్బాయిలు కూడా. కొన్నిసార్లు వివాహం తర్వాత ఆ స్త్రీ అదృష్టం భర్తకు పడుతుంది. అంతే పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి అలాంటి అదృష్టం ఉన్న స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా..? అమ్మాయిలు మీ పుట్టమచ్చల ఆధారంగా.. మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు..! ఇంకెందుకు ఆలస్యం ఆర్టికల్ మొత్తం చదివేయండి.!
కాలిమీద పుట్టుమచ్చ:
కాలిమీద పుట్టుమచ్చ ఉంది అంటే వాళ్లు చాలా తెలివైనవారు అని అర్థం. ఆమె కనుక మీ జీవితంలోకి వచ్చింది అంటే మీకు అదృష్టం వచ్చినట్లే. దీంతో మీ జీవితం మరింత మెరుగు పడుతుంది. కాబట్టి కాలు మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకోవడం మంచిది.
బొటన వేలుపై పుట్టుమచ్చ:
ఒకవేళ కనుక అమ్మాయి బొటన వేలు పై పుట్టుమచ్చ ఉంది అంటే ఆమె జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. బొటన వేలు దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే ఆమె జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి.
నుదుటి మధ్యలో పుట్టుమచ్చ:
నుదిటి మధ్యలో పుట్టుమచ్చ ఉంది అంటే ధనవంతుడుని వివాహం చేసుకుంటుంది. ఆమె పెళ్లి తర్వాత డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అలానే జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది.
చేతి పై పుట్టుమచ్చ:
స్త్రీ చేతి పై కనుక పుట్టుమచ్చ ఉంది అంటే భర్త ఎంతో బాగా చూసుకుంటారు. వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందట.
కంటి కింద పుట్టుమచ్చ:
కంటి కింద పుట్టుమచ్చ ఉన్న స్త్రీ కనుక భార్యగా వచ్చిందంటే అదృష్టమే. పైగా ఆమె కూడా పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు.
నాభి వద్ద పుట్టుమచ్చ:
ఇక్కడ పుట్టుమచ్చ ఉంది అంటే స్త్రీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతుందని.. భర్త అదృష్టవంతుడు అని అంటారు.
పాదాల కింద పుట్టుమచ్చ:
పాదాల కింద పుట్టుమచ్చ ఉంది అంటే జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అర్థం. పైగా జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుందట.
పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం అలా ఉంటుందనమాట.. అలా అని అబ్బాయిలు మీరు వెళ్లి మీకు ఎక్కెడక్కడ పుట్టుమచ్చులు ఉన్నాయని అడిగేరు.. మాములుగా కొట్టరు..! ఇది కేవలం అమ్మాయిలు తెలుసుకోవడానికే అందించాం.