కెరీర్ లో ఉత్తమ ర్యాంక్ లను అందుకున్న ఇషాన్ కిషన్ , గిల్ !

-

టీం ఇండియా తరపున వన్ డే ప్రపంచ కప్ ఆడడానికి ఎంపికైన యంగ్ క్రికెటర్స్ ఇషాన్ కిషన్ మరియు శుబ్మం గిల్ లకు ఒకరోజు తరువాత మరో శుభవార్త వారిని పలకరించింది. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన వన్ డే ర్యాంకింగ్ లలో ఈ యంగ్ ప్లేయర్లు ఇద్దరూ కూడా కెరీర్ లోనే ఉత్తమైన ర్యాంక్ లను అందుకున్నారు. వెస్ట్ ఇండీస్ గడిచిన వన్ డే సిరీస్ లో ప్రదర్శన కారణంగా ఇద్దరికీ మంచి ర్యాంక్ లు వచ్చాయి. మొదటగా ఓపెనర్ బ్యాట్స్మన్ శుబ్మం గిల్ ఐసీసీ ప్రకటించిన ర్యాంక్ లలో 750 పాయింట్ లతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఇక కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మాత్రం 624 పాయింట్ లను దక్కించుకుని 24వ ర్యాంక్ ను సాధించాడు. ఇక ఎప్పటిలాగే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రం 10వ ర్యాంక్ లో ఉన్నాడు.

మరి త్వరలో జరగనున్న వన్ డే మ్యాచ్ లలో మరింతగా రాణించి తమ ర్యాంక్ లను ఇంకా వృద్ధి చేసుకుంటారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news