ఈ అలవాట్లకు దూరంగా ఉంటేనే ఇంట్లో లక్ష్మి దేవి ఉంటుంది..!

-

ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేకుండా ఆనందంగా వుండే వాళ్ళు ఉండరు. అయితే ఎక్కువమంది ఎదురుకునే సమస్యలలో ఆర్థిక ఇబ్బంది ఒకటి. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమవుతూ వుంటారు. అయితే ఆచార్య చాణక్య ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి చాణక్య చెప్పినట్లు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.

మానవుడికి ఉండే కొన్ని చెడ్డ లక్షణాల వలన చెడ్డ అలవాట్లు వల్ల లక్ష్మీదేవిని దూరం చేసుకుంటున్నారని చాణక్య అన్నారు మరి ఎటువంటి వాటికి దూరంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

డబ్బు వృధా చేయటం

చాలా మంది డబ్బులు వృధా చేస్తూ ఉంటారు డబ్బుని అధికంగా ఖర్చు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని… లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని చాణక్య చెప్పారు.

పొయ్యి మీద అంట్లుని ఉంచడం

చాలామంది ఏం చేస్తారంటే తినేసిన పాత్రలని వండుకున్న కాళీ పాత్రలుని పొయ్యి మీద పెడుతూ ఉంటారు దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ చెడ్డ అలవాటుకి దూరంగా ఉండటం మంచిది.

ఇతరుల్ని అవమానించడం

పెద్దలని కానీ పండితులని కానీ స్త్రీలని కానీ ఎప్పుడూ అవమానించకూడదు ఇటువంటి ప్రవర్తన ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు కాబట్టి ఈ తప్పును ఎప్పుడూ చేయకూడదు.

సూర్యాస్తమయం అప్పుడు ఇల్లుని కడగడం

సూర్యాస్తమయం సమయంలో ఇల్లు ఉడ్చితే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి ఈ తప్పు కూడా చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news