2022 ఎండింగ్లో గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ.. తల్లిగా.. వీడియో వైరల్..!!

-

రేపటి రోజున న్యూ ఇయర్ లోకి అడుగుపెడుతున్న వేళ ప్రముఖ హీరోయిన్ పూర్ణ అభిమానులకు తాజాగా ఒక శుభవార్త తెలియజేసింది. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు తెలియజేస్తోంది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో తన కుటుంబ సభ్యులతో ఈ శుభవార్త తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తల్లిగా ప్రమోషన్ పొందుతున్న ఆనందంలో పలు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటోంది. ఈ విషయాన్ని కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది.

దీంతో అభిమానులు పూర్ణాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీన దుబాయ్ వేదికగా వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో ఈమె తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. పెళ్లి విషయాన్ని నాలుగు నెలల పాటు రహస్యంగా ఉంచిన ఈమె అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కానీ తాను తల్లి కాబోతున్నట్లు విషయాన్ని మాత్రం ఆ వెంటనే ప్రకటించింది పూర్ణ. దీంతో పూర్ణ కుటుంబ సభ్యులు చాలా ఆనంద పడుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి సీమటపాకాయ్ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇక తర్వాత రాజు గారి గది, అవును,లడ్డు బాబు తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి సినిమాలలో కూడా నటించింది. ముఖ్యంగా ఈమె ఢీ డాన్స్ షో, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో జబర్దస్త్ షోలో కూడా జడ్జిగా కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతం పూర్ణాకు సంబంధించి ఈ వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news