ఆ దేశంలో సెల్ఫీ దిగితే రూ. 25వేల ఫైన్.. రోడ్డుపై వాదనకు దిగితే రూ. 35 వేలు కట్టాలి..!

-

దేశంలో: కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.. వీటికి కూడా ఫైన్‌ వేస్తారా అని మీరు అనుకోవచ్చు.. ఆ వింత చట్టాలు చూస్తే మీకు తలనొప్పి వస్తుంది. జనరల్‌గా మనం రోడ్డుపై తిరిగే కుక్కలకు, ఆవులకు ఏదో ఒక ఆహారం వేస్తుంటారు.. కానీ ఆ దేశంలో అలా ఇస్తే.. జరిమానా కట్టాల్సి వస్తుంది. ఇంకా ఈ తిక్క చట్టాలు చాలా ఉన్నాయి.. అవేంటంటే..

 

అందమైన దేశమైన గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లోని కొన్ని ప్రదేశాలలో పర్యాటకులు హైహీల్స్ ధరించడం నిషేధించబడింది. అక్రోపోలిస్, ఎపిడారస్ థియేటర్, పెలోపొన్నీస్ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు హైహీల్స్ ధరించడాని వీల్లేదు.. ఈ పాదరక్షలు పురాతన వారసత్వానికి హాని కలిగిస్తున్నందున 2009 సంవత్సరంలో ఈ చట్టం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చే వ్యక్తులు అరికాళ్ళకు బూట్లు మాత్రమే ధరించాలి.

స్పెయిన్‌లోని మలాగా రిసార్ట్.. ఈ వింత చట్టాల జాబితాలో ఫస్ట్‌ ఉంటుంది.. ఇక్కడ రాత్రి జీవితం చాలా బాగుంటుంది.. అయితే చాలా సార్లు ఇక్కడికి వచ్చే పర్యాటకుల కూల్ బిహేవియర్‌ను స్థానిక ప్రజలు ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో.. తక్కువ బట్టలు లేదా అభ్యంతరకరమైన వస్తువులతో కనిపించే వ్యక్తులపై స్థానిక పరిపాలన £663 అంటే 68 వేల జరిమానా విధిస్తారు. ఇది మాత్రమే కాదు.. స్పెయిన్‌లోని టెనెరిఫ్‌లో.. రోడ్ల మీద తిరిగే జంతువులకు ఆహారం ఇస్తే 66 వేల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది.

ఇక థాయ్‌లాండ్‌లో ఈ చట్టం మరీ డేండర్‌.. 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుంది.. అనుకోకుండా థాయ్‌లాండ్ కరెన్సీపై అడుగు పెట్టినట్లయితే.. మీరు నేరుగా జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది ఇక్కడ పెద్ద నేరంగా పరిగణిస్తారు..

ఇటలీకి వచ్చేవారు ఇక్కడకు వస్తే గంటల తరబడి నిలబడి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు. జనం రద్దీని నివారించడానికి.. ఏదైనా పర్యాటక ప్రదేశంలో ఎక్కువసేపు ఉండి ఫోటోలు తీసుకుంటే.. £243 అంటే రూ. 25,000 జరిమానా విధిస్తారు. ఈ నిబంధన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది.

మన దేశంలో రోడ్డుపై కొట్లాటలు కామన్‌.. పిచ్చి పిచ్చిగా తిట్టుకుని అరుసుంకుంటారు.. కానీ ఆస్ట్రేలియాలో… ఎవరైనా బహిరంగ ప్రదేశంలో వాదనలకు దిగితే.. భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఎవరైనా అసభ్య పదజాలం వాడితే రూ.35 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో.. జరిమానా 68 వేల వరకు విధిస్తారు. అలాగే 3 నెలల జైలు శిక్ష విధించబడుతుంది.

దుబాయ్‌కి వచ్చే పర్యాటకులు బహిరంగ ప్రదేశాల్లో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ప్రేమ చూపించడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే జంటలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో.. ఫ్రాన్స్‌లోని రైల్వే స్టేషన్లలో ముద్దులపై నిషేధం ఉంది.

ఐ లవ్‌ ట్రావెలింగ్‌ అనేవాళ్లకు ఈ ఆర్టికల్‌ కచ్చితంగా షేర్‌ చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news