సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు – సిపిఐ నారాయణ

-

ఢిల్లీలో కొన్నేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కి మధ్య జరుగుతున్న పోరుపై గతంలో విచారణ జరిపిన కోర్టులు.. ప్రభుత్వం కంటే గవర్నర్ కే అధికారం ఉందని తేల్చి చెప్పాయి. ఇవాళ సుప్రీంకోర్టు ఆ తీర్పులను కొట్టివేసింది. తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్ కి ఊరట లభించింది.

అయితే సుప్రీం తీర్పు పై స్పందించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు లాంటిది అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి హక్కులు లేకుండా చేస్తే ఎలా..? అని ప్రశ్నించారు నారాయణ. ఢిల్లీ సీఎం ని పంజరంలో చిలకలా బంధించాలని కేంద్రం చూస్తుందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజా తీర్పును వ్యతిరేకించడమేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. తెలంగాణ, పాండిచ్చేరి, కేరళ గవర్నర్ లు కూడా పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news