శృంగారంలో స్పర్శ ప్రాధాన్యం.. తెలిస్తే విజృంభణ.. లేదంటే తేలిపోవడమే..

ఇద్దరు భాగస్వాముల శృంగార జీవితం సరిగ్గా లేదని చెప్పడానికి వారి బంధంలో కనిపించే సంకేతాలను చూసి చెప్పవచ్చు. శృంగార జీవితం బాగుంటే వారి బంధం బలపడుతుంది. చిన్న చిన్న విషయాలు వారిని పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఒకరికొకరు సులభంగా అర్థం అవుతారు. భాగస్వామిని అర్థం చేసుకోవడంలో ముందుంటారు. అందుకే వారి బంధం బాగుంటుంది. ఐతే శృంగారంలో స్పర్శ ప్రాధాన్యం చాలా ఉంటుంది. అది తెలియకపోతే శృంగారాన్ని సరిగ్గా ఆనందించలేరు.

నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా అనే సినిమా పేర్లు గల మాటలన్నీ స్పర్శ ద్వారా తెలియజేయవచ్చు. శృంగారానికి పునాది స్పర్శే కావాలి. ఫోర్ ప్లేకి ముందు గాఢమైన స్పర్శ ఫోర్ ప్లే లోకి లాగి అటు నుండి శృంగారంలోకి తీసుకెళ్ళాలి. అప్పుడే అది సరైన కలయిక అని చెప్పవచ్చు. దానివల్ల ప్రేమలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. లేదంటే స్పర్శ ప్రేమకి చిహ్నం. ఆ ప్రేమ కొంచెం కొంచెం పెద్దదై విడదీయరాని బంధంగా మారుతుంది.

అప్పుడే శృంగార జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతుంది. దానివల్ల సాధారణ జీవితంలో ఒత్తిడులు తగ్గుతాయి. మీకంటూ ఒకరున్నారన్న భావన మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అందుకే స్పర్శ చాలా ముఖ్యం. మీ భాగస్వామిని ఆనందింపజేయాలన్నా, ఆ ఆనందంలో మీరు మునిగి తేలాలన్నా, శృంగార జీవితాన్ని ఆస్వాదించాలన్నా స్పర్శ చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎక్కడ స్పర్శిస్తే బాగుంటుందో మీ భాగస్వామిని అక్కడ స్పర్శించడం ద్వారా తెలియజేయాలి. శృంగారంలో మాటల కంటే చేతలే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.