తెలుగురాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్ పై Z అనే అక్షరం ఉంటుంది..దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..!

-

మనం చాలాసార్లు ఆర్టీసీబస్సులో ప్రయాణించే ఉంటాం. అయితే ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు నంబర్లను గమనించారా..ఆంధ్రా-తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు మధ్య ఉండే తేడా..ఆంధ్రా అయితే ఏపీ అని, తెలంగాణ అయితే టీఎస్ అని ఉంటుంది. ఈ తేడా మనం గమనించే ఉంటాం. కానీ రెండు రాష్ట్రాల్లో తిరిగే బస్సులు నంబర్ ప్లేట్ లో Z అనే అక్షరం కామన్ గా ఉంటుంది. రెండు స్టేట్స్ లో ఈ అక్షరం ఎందుకు పెట్టారో తెలుసా..దీని వెనుక ఓ పెద్ద కథే ఉందట. చిన్నగా చూద్దాం ఇప్పుడు.

హైదరాబాద్ ని ఒకప్పుడు నిజామ్స్ పరిపాలించారని మనకు తెలిసిన విషయమే..1932 సమయంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరబాద్ కు నిజాంగా ఉండేవాళ్లు. ఆయన తల్లి పేరు జహ్రాభేగం. ఆయన హయాంలోనే ఆర్టీసీ బస్సు రవాణా ప్రారంభించారు. ప్రారంభంలో ఆర్టీసీ బస్సులు సంఖ్య 22 మాత్రమే ఉండేదట. అప్పుడు బస్సు నంబర్లు HYZ అని మొదలయ్యేవి.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి మీద ఉన్న ప్రేమతో ముందు తన తల్లి పేరు తోనే బస్సు సేవలను ప్రారంభించాలని అనుకున్నారట. కానీ అలా ఒక వ్యక్తి పేరుతో పబ్లిక్ వాహనాలు నడవకూడదు అని ప్రభుత్వం చెప్పడంతో తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని బస్సు నంబర్ ప్లేట్ లపై రాయించారు. తర్వాత సంవత్సరాలు గడిచినా అదే కొనసాగుతూ వస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ అక్షరాన్ని పెట్టడానికి గల కారణాన్ని అధికారులు గౌరవిస్తూ అది అలాగే ఉంచేశారు. అలా రెండు రాష్ట్రాల్లో బస్సు సేవలు మొదలైనప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ Z సిరీస్ తోనే రిజిస్టర్ అవుతున్నాయి.

ముందు నుంచి బస్సు నంబర్లలో Z అక్షరం ఉన్నాకూడా రిజిస్ట్రేషన్ శాఖ వాళ్లకి ఆ అక్షరం ఎందుకు ఉందో తెలియదు. 1989లో వారికి ఈ కారణం తెలిసింది అని చెప్పారు. కానీ ఇలా Z అక్షరం పెట్టడం మాత్రం కేవలం ప్రభుత్వ వాహనాలకే పరిమితం అయింది.

అద్దెకి తీసుకున్న వాహనాలకి లేదా ప్రైవేటు బస్సులకు ఈ అక్షరం ఉండదు. ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో ఎటువంటి ఒప్పందం చేసుకోకపోయినా తల్లి మీద ఉన్న గౌరవంతో Z అక్షరం పెట్టడం కొనసాగిస్తుూ వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ బస్సుల నెంబర్లలో Z అక్షరం ఉండడం వెనుక కారణం. ఈసారి బస్సులు కనిపించినప్పుడు గమనించండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news