Bujji Ila Raa: “బుజ్జీ.. ఇలా రా” అంటున్న ధ‌న్‌రాజ్.. భ‌య‌పెడుతున్న టీజ‌ర్..!

-

Bujji Ila Raa: కామెడీయ‌న్ సునీల్‌, జ‌బ‌ర్థ‌స్త్ ఫేం ధన్‌రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చాందిని అయ్యంగార్‌ హీరోయిన్ న‌టిస్తుంది. ‘గరుడవేగ డైరెక్ట‌ర్ అంజి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఆద్యంతం చాలా ఆసక్తికరంగా అనిపించింది. కిడ్నాప్ ల చుట్టూ ఈ కథ రాసుకున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే, ఇంతకీ కిడ్నాప్‌లకు పాల్పడు తున్న కిడ్నాపర్ ఎవరనేదే సస్పెన్స్‌కి గురి చేసే అంశం అనిపించేలా బుజ్జి ఇలా రా టీజర్ కట్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. మూవీ ప్రొడ్యూస‌ర్లు అగహ్రారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ”ఈ సినిమాకు అన్నీ మా అన్న జీ నాగేశ్వరరెడ్డి గారే. అలాగే.. ది అంగ్రెజ్, టాటా బిర్లా మధ్యలో లైలా నుంచి గరుడవేగ చిత్రం వరకు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫి చేసిన అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

http://<iframe width=”640″ height=”360″ src=”https://www.youtube.com/embed/j3xDCQ1Ir6U” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ధన్‌రాజ్‌ మాట్లాడుతూ .. కేవలం 45 రోజుల్లో సినిమాను పూర్తి చేశామ‌నీ, సైకో థ్రిల‌ర్ గ్ ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌దని తెలిపారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ అద్బుత‌మైన సంగీతాన్ని అందించార‌ని తెలిపారు. బుజ్జి ఇలా రా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news