అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రత్యేకం: అహర్నిశలు శ్రమించే ఆ నర్సుల పోరాటానికి సలాం…!

-

నిజంగా వైద్య రంగం అంటేనే సేవ అందించడం. మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు. నర్సులు తమ పేషెంట్స్ ని కంఫర్ట్గా చూసుకోవడం, వాళ్ళ యొక్క బాధలను తెలుసుకోవడం ఇలా ఎంతో నెమ్మదిగా, శాంతంగా సొంత కుటుంబాన్ని చూసుకున్నట్లు చూసుకుంటారు.

 

ప్రజల ఆరోగ్య రక్షణ లో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు. మామూలుగా చేసే సేవ ఒక ఎత్తయితే ఈ మహమ్మారి సమయం లో చేసే సేవా మరొక ఎత్తు అని చెప్పాలి.

ఎంతో మంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా పేషెంట్ల కోసం ఎంత గానో సేవలు అందిస్తున్నారు. నిజంగా అటువంటి నర్సులు అందర్నీ కూడా మనం మెచ్చుకొని తీరాలి.
మాస్కులు ధరించి, పీపీఈ కిట్లు వేసుకుని చేతులు కందిపోతున్న, ఒళ్ళు ఉక్కి పోతున్నా సరే నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.

ప్రాణం పోతుందేమో అని భయపడే పేషెంట్ల కి అండగా నిలబడ్డారు. ఎంతటి ప్రమాదం అయినా సరే మేమున్నాం అనే భరోసాని వాళ్ళలో కల్పించారు. అంటువ్యాధి అయినా సరే దూరం వెళ్ళి పోకుండా దగ్గర ఉండి మరి వాళ్ళ యొక్క బాధ్యతను పూర్తి చేస్తున్నారు.

వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టి ఒకరి కోసం పోరాడుతూనే ఉన్నారు. నిజంగా సపర్యలు చేసి ప్రాణం నిలిపే ఆ సోదరికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.. మన ప్రాణాలు నిలపడం కోసం అహర్నిశలు కష్టపడే ఆమె ఋణం తీర్చుకోలేము.

Read more RELATED
Recommended to you

Latest news