కిచెన్ సింక్ నుండి దుర్వాసన వస్తోందా..? ఇలా చేస్తే కొత్త దానిలా మారిపోతుంది..!

-

కిచెన్ సింక్ నుండి దుర్వాసన రావడం సహజం. చాలామంది కిచెన్ సింక్ నుండి దుర్వాసన కలగకూడదని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే సమస్యని మీరు కూడా ఫేస్ చేస్తున్నారా..? ఈ సమస్య లేకుండా చూసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టెక్నీక్స్ ని ఫాలో అవ్వాల్సిందే ఇలా కనుక మీరు చేశారంటే కచ్చితంగా సింక్ నుండి దుర్వాసన రాదు. కిచెన్ లో వంట పాత్రలు మొదలు మిగిలిన ఆహార పదార్థాలు ఇలా ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి వీటిలో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా సింక్ లోకి పేరుకు పోతుంది దీంతో సింక్ నుండి చెడు వాసన వస్తుంది.

అయితే చాలా మంది కెమికల్స్ ని ఉపయోగించి సింక్ ని క్లీన్ చేస్తూ ఉంటారు కానీ అది మంచిది కాదు. మళ్ళీ వంట సామాన్లు పాత్రలు మనం అందులో పెడతాం కాబట్టి వాటికి మళ్లీ కెమికల్స్ అంటుకుంటాయి. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. సింక్ లో కూరుకుపోయిన నూనె వంటి జిడ్డు ని తొలగించడానికి వేడి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి కొంచెం బ్లీచింగ్ పౌడర్ తో హాట్ వాటర్ వేసి కడిగితే క్షణాల్లో క్లీన్ అయిపోతుంది.

త్వరగా మురికి అంతా కూడా పోతుంది దుర్వాసన కూడా రాదు. వేపాకులతో కూడా క్లీన్ అవుతుంది వేప ఆకుల్ని నీళ్లల్లో వేసి మరిగించి ఆ నీటిని సింక్లో వేయండి తర్వాత సబ్బు నీటిని ఉపయోగించి సింక్ ని స్క్రబ్ చేస్తే సింక్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. బేకింగ్ సోడా తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సింక్ కొత్త దానిలాగ మెరిసిపోతుంది వెనిగర్ నిమ్మకాయని ఉపయోగించి కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. దుర్వాసన తొలగిపోతుంది క్షణాల్లో మీరు సింక్ ని శుభ్రం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news