బీఆర్ఎస్ పక్కా విన్నింగ్ సీటు..మెజారిటీపైనే లెక్క.!

-

తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలు లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలాంటి సీట్లలో సిద్ధిపేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది పక్కా బి‌ఆర్‌ఎస్ గెలిచే సీటు..ఎప్పుడైతే కే‌సి‌ఆర్ టి‌డి‌పి వదిలి..టి‌ఆర్‌ఎస్ పెట్టారో..అప్పటినుంచి ఇక్కడ గెలుస్తూనే వస్తున్నారు. 1985 నుంచి 1999 వరకు ఇక్కడ కే‌సి‌ఆర్..టి‌డి‌పి నుంచి గెలిచారు. ఆ తర్వాత టి‌డి‌పి వదిలి టి‌ఆర్‌ఎస్ పెట్టి..ఉపఎన్నికలో పోటీ చేసి మళ్ళీ గెలిచారు.

ఇక 2004 ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ఇక్కడే పోటీ చేసి గెలిచారు. కాకపోతే అటు ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2004లో ఉపఎన్నిక రాగా టి‌ఆర్‌ఎస్ నుంచి హరీష్ రావు పోటీ చేసి గెలిచారు. అక్కడ నుంచి హరీష్ రావు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా విజయాలు సాధిస్తూనే వస్తున్నారు. 2008 ఉపఎన్నిక, 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఎప్పటికప్పుడు ఆయన మెజారిటీ పెంచుకుంటూనే వస్తున్నారు. 2014లో 93 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన హరీష్..2018లో లక్షా 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇదే భారీ మెజారిటీ..ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సిద్ధిపేటలో హరీష్ గెలుపుని ఆపడం ఎవరి తరం కాదనే చెప్పాలి. మంత్రిగా అద్భుతంగా పనిచేస్తూనే..మరోవైపు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. సంక్షేమంలో నెంబర్ 1 లో పెట్టారు. ఇలా చేస్తున్నప్పుడు సిద్ధిపేట ప్రజలు హరీష్‌ని తప్ప మరొకరి వైపు వెళ్ళడం కష్టం.

నెక్స్ట్ ఎన్నికల్లో సిద్ధిపేటలో మళ్ళీ హరీష్ గెలవడం ఖాయం.అందులో ఎలాంటి డౌట్ లేదు..కాకపోతే మెజారిటీపైనే లెక్కలు నడుస్తున్నాయి. గత మెజారిటీని ఈ సారి దాటుతారా? లేక దాటలేరా? అనే చర్చ మాత్రం ఉంది. చూడాలి మరి ఈ సారి హరీష్ మెజారిటీ ఎంత ఉంటుందో.

 

Read more RELATED
Recommended to you

Latest news