మీ మెదడుని పదునుచేసే అద్భుతమైన చిట్కాలు…

-

మన శరీరంలో ప్రతీ అవయవం లాగే మెదడుకి కూడా వ్యాయామం అవసరం. వ్యాయామం చేయకపోతే శరీరం ఎలా మొద్దుబారిపోతుందో మెదడు కూడా మొద్దుబారిపోతుంది. అందుకే బ్రెయిన్ ఎక్సర్ సైజ్ ఖచ్చితంగా అవసరం. ఐతే మరి బ్రెయిన్ ఎక్సర్ సైజ్ ఎలా చేయాలి. ఎల్లప్పుడూ మెదడు షార్ప్ గా పనిచేయాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

సరైన రోజువారి దినచర్య

సరైన నిద్ర, సరైన తిండి, సరైన వ్యాయామం అవసరం. వీటిలో ఏది తక్కువైనా మెదడు మీద ఎఫెక్ట్ పడి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రోజు వారి దినచర్య సక్రమంగా ఉంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలో నుండి లేచిన తర్వాత అవతలి వారు చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకోకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోయినా ఏదీ తలకెక్కకపోవడానికి కారణాలు ఇవే.

ఎప్పుడూ మెదడుకి పని కల్పించడం

సాధారణంగా చదువు పూర్తయ్యాక మెదడుకి పనిచెప్పడం మానేస్తారు. కొత్త విషయాలని నేర్చుకోవడంలో వెనకడుగు వేస్తారు. కానీ కొత్త విషయాలు నేర్చుకుంటూ, వాటిని మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ ఉంటే మెదడు షార్ప్ గా తయారవుతుంది.

చిన్న సినిమా తయారు చేయండి

మీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలని తలచుకోండి. కనీసం నెలకి ఒకసారైనా, ఆ నెలలో ఏం చేసారో తల్చుకోండి. చిన్న చిన్న విషయాలు మీకు గుర్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

చెడు అలవాట్లు పక్కన పెట్టేయాలి

చెడు అలవాట్లు శరీరానికే కాదు మెదడుకి కూడా హానిచేస్తాయి. చెడ్డవి అనిపించే అన్ని అలవాట్లని పక్కన పెట్టేయండి.

లింక్

ఏ విషయమైనా గుర్తుండాలంటే ఆ విషయానికి మరో విషయాన్ని లింక్ చేయండి. దాని ద్వారా ఆ రెండు విషయాలు గుర్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news