నీ జీవిత బ్యాంకులో రోజూ డిపాజిట్ అవుతున్న డబ్బు గురించి నీకు తెలుసా?

-

నీ బ్యాంకు అకౌంట్లో రోజూ 86,400రూపాయలు డిపాజిట్ అవుతున్నాయనుకుందాం. సాయంత్రం అవగానే ఆ డబ్బంతా ఖాళీ అవుతుందన్న షరతు ఉంటే, సాయంత్రం లోపే ఖర్చు చేయాలన్న నిబంధన ఉన్నప్పుడు నువ్వేం చేస్తావ్? ఈ ప్రశ్నకి ఎవ్వరైనా చెప్పే సమాధానం ఒక్కటే. బ్యాంకులో డిపాజిట్ అవుతున్న రోజువారి అమౌంటుని ఎప్పటికప్పుడు విత్ డ్రా చేసుకుంటానని. నిజమే.. మరి నీ జీవిత బ్యాంకులో రోజూ 86,400సెకన్లు డిపాజిట్ అవుతున్నాయి. వాటినేం చేస్తున్నావు?

 

పొద్దున్న లేవగానే అందరికీ 86,400సెకన్లు లభిస్తాయి. వాటితో నువ్వేం చేస్తావు? వాటిని ఎలా ఉపయోగిస్తావన్నదే నీ భవిష్యత్తు. మీ బ్యాంకులో అమౌంట్ లాగా ఈ సెకన్లను నువ్వు విత్ డ్రా చేసుకోలేవు. రేపటి కోసం దాచలేవు. ఎప్పటికప్పుడు వినియోగిస్తూనే ఉండాలి. మరి నువ్వు సరిగ్గా వినియోగిస్తున్నావా? వృధా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించావా? టైమ్.. మళ్ళీ మళ్ళీ రాదు. కాల ప్రయాణం ముందుకే తప్ప వెనక్కి ఉండదు. మరి నీకున్న కాలంలో నువ్వేం చేస్తున్నావ్?

కనీసం దానికి సరైన ప్రాముఖ్యం ఇస్తున్నావా? మీ జీవితంలో ప్రతీ క్షణం ముఖ్యమే. ఏ క్షణం ఏ అద్భుతమైన ఆలోచన మీ భవిష్యత్తును మారుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. గొప్ప గొప్ప ఆలోచనలన్నీ సెకన్ల కాలంలో వచ్చిన ఆలోచనలే. అందుకే ప్రతీ క్షణాన్ని ఆనందించాలి. ప్రతీ క్షణాన్ని పనిచేయాలి. ఆనందించాలి. లేదంటే కొన్ని రోజులు పోయాక, మీ జీవితంలో వృధా అయిన క్షణాలు మీ వెనకాల లక్షలో సంఖ్యలో కనిపిస్తూ ఉంటే వాటిని చూసి మీరు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది.

అందుకే మీ బ్యాంకు అకౌంటుని సరిగ్గా ఉపయోగించడం ఇప్పుడే తెలుసుకోండి. డేర్ టూ డూ మోటివేషన్ ఆధారంగా.

Read more RELATED
Recommended to you

Latest news