పెళ్లి చేసుకుంటే చాలు.. నెలనెలా జీతం ఇస్తారు? ఎక్కడో తెలుసా?

-

ఈ పథకం వల్ల కుటుంబ బాంధవ్యాలు బలోపేతం అవుతాయని.. స్త్రీలకు నెల నెలా కొంచెం డబ్బు వస్తే.. వాళ్లు డబ్బు మీద కాకుండా తమ పిల్లల పోషణ, వాళ్ల ఎదుగుదలపై దృష్టి పెడతారని.. అందుకే కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెబుతున్నారు.

కేవలం పెళ్లి చేసుకుంటే చాలు. మీరు ఆఫీసుకు వెళ్లకున్నా ఏం పర్వాలేదు. నెలనెలా జీతం మీ అకౌంట్లో పడిపోతుంది. అరె.. ఇదేదో బాగుందే. పెళ్లికి పెళ్లి.. జీతానికి జీతం.. అని సంకలు గుద్దుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ ఆఫర్ ఎక్కడో తెలుసా? కువైట్‌లో. అది కూడా అందరికి కాదు. మహిళలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్.

కువైట్‌కు చెందిన మహిళలు ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. అంతే.. వాళ్లు జాబ్ చేయాల్సిన పని లేదు. ప్రభుత్వమే వాళ్లకు నెలనెలా శాలరీ ఇస్తుంది. కాకపోతే కొన్ని షరతులు. వాళ్లు పెళ్లి చేసుకొని.. ఏ ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేయకూడదు. కంపెనీల్లో పని చేయకూడదు. ఇన్‌స్టిట్యూట్స్ స్థాపించి ఉండకూడదు. అంటే.. పెళ్లి చేసుకొని ఉండి.. తమ ఫ్యామిలీని పోషించడానికి ఎటువంటి ఆధారం లేని మహిళలను ఆర్థికంగా ఆదుకునే పథకం అన్నమాట. దీనికి కువైట్ ప్రభుత్వం ఉచిత జీతం పథకం అని పేరు పెట్టింది.

ఈ పథకం వల్ల కుటుంబ బాంధవ్యాలు బలోపేతం అవుతాయని.. స్త్రీలకు నెల నెలా కొంచెం డబ్బు వస్తే.. వాళ్లు డబ్బు మీద కాకుండా తమ పిల్లల పోషణ, వాళ్ల ఎదుగుదలపై దృష్టి పెడతారని.. అందుకే కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెబుతున్నారు. అంతే కాదు.. ఆర్థిక, ఇతర సమస్యల వల్ల కువైట్‌లో పెరుగుతున్న విడాకుల కేసులను కూడా ఈ పథకం ద్వారా తగ్గించవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news